తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Russia Ukraine War | యుద్ధానికి మూడు నెలలు పూర్తి.. పుతిన్​తో జెలెన్​స్కీ భేటీ!

Russia Ukraine war | యుద్ధానికి మూడు నెలలు పూర్తి.. పుతిన్​తో జెలెన్​స్కీ భేటీ!

HT Telugu Desk HT Telugu

24 May 2022, 11:12 IST

    • Russia Ukraine war | రష్యా ఉక్రెయిన్​ యుద్ధం నాలుగో నెలకు చేరింది. కానీ యుద్ధానికి ముగింపు ఎప్పుడు? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.
రష్యా దాడిలో ఉక్రెయిన్​ పరిస్థితులు..
రష్యా దాడిలో ఉక్రెయిన్​ పరిస్థితులు.. (REUTERS)

రష్యా దాడిలో ఉక్రెయిన్​ పరిస్థితులు..

Russia Ukraine war | రష్యా ఉక్రెయిన్​ యుద్ధానికి.. మంగళవారంతో మూడు నెలలు పూర్తయ్యాయి. నాలుగో నెలలోకి అడుగుపెట్టినా.. 'యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది?' అన్న ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. పైగా.. ఫిబ్రవరి 24న మొదలైన దండయాత్రలో.. రష్యా అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళనకర విషయం.

ట్రెండింగ్ వార్తలు

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

విధ్వంసం.. వినాశనం..

  • యూకే రక్షణశాఖ ప్రకారం.. తూర్పు ఉక్రెయిన్​ మొత్తాన్ని రష్యా సైనికులు ముట్టడించారు! అదే సమయంలో యుద్ధవిచ్ఛిన్న దేశంలోని అనేక ప్రాంతాలపై రష్యా దళాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి.
  • రష్యా దాడుల్లో అనేకమంది ఉక్రెయిన్​ జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలోని ఉత్తర ప్రాంతంలో.. శిక్షణా శిబిరంపై రష్యా దాడి చేయగా.. అందులోని 87మంది ప్రాణాలు కోల్పోయారు.
  • Ukraine news today | కాగా.. రష్యా యుద్ధనేరాలపై విచారణ చేపట్టిన ఉక్రెయిన్​.. ఓ సైనికుడికి జీవిత ఖైదు శిక్షను విధించింది. యుద్ధం వేళ.. రష్యా సైనికుడిని ఉక్రెయిన్​ శిక్షించడం ఇదే తొలిసారి.
  • లుహాన్స్క్, సెర్హి గైడై ప్రాంతాలకు ఆక్రమించుకునేందుకు 1,25,000మంది రష్యా సైనికులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కాగా.. టోష్కివ్క ప్రాంతం నుంచి రష్యా దళాలను తరిమికొట్టినట్టు ఉక్రెయిన్​ ప్రకటించింది.
  • రష్యా దళానికి చెందిన 29వేల మందిని చంపినట్టు ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ వెల్లడించారు. రష్యాపై ఆంక్షలతో విరుచుకుపడాలని.. దావోస్​లో జరిగిన వరల్డ్​ ఎకనామిక్​ ఫారంలో పిలుపునిచ్చారు.
  • యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు జెలెన్​స్కీ పేర్కొన్నారు. రష్యా అధికారుల్లో.. ఆ దేశాధ్యక్షుడు పుతిన్​తో మాత్రమే తాను చర్చలు జరుపుతానని అన్నారు. 'రష్యాలో నిర్ణయాలన్నీ అధ్యక్షుడే తీసుకుంటారు. ఆయన లేకుండా.. యుద్ధం ముగింపునకు చర్చలు జరిపి లాభం లేదు. అధ్యక్షుడు పిలిస్తే.. చర్చలకు నేను సిద్ధం,' అని జెలెన్​స్కీ స్పష్టం చేశారు.

బైడెన్​ హెచ్చరిక..

Quad summit 2022 | జపాన్​ వేదికగా జరిగిన క్వాడ్​ సదస్సులో.. రష్యా ఉక్రెయిన్​ యుద్ధాన్ని ప్రస్తావించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. ఈ క్రమంలో రష్యాకు తీవ్ర హెచ్చరికలు చేశారు. రష్యా ఇప్పుడు.. సైనికులను మాత్రమే చంపడం లేదని, ఉక్రెయిన్​ స్కూళ్లు, అమాయకులు, చిన్నారులపై దాడి చేస్తోందని మండిపడ్డారు. ఉక్రెయిన్​ సంస్కృతిని చరిత్ర నుంచి చెరిపివేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్​ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

"ఉక్రెయిన్​పై రష్యా చేపట్టిన దాడి.. మానవతా సంక్షోభానికి దారితీసింది. వేలాది మంది అమాయకులు.. శరణార్థులుగా మారి, వీధి మీద పడ్డారు. ఉక్రెయిన్​ అనేది యూరోప్​ ఒక్క సమస్య కాదు. ఇది మొత్తం ప్రపంచ సమస్య. ఉక్రెయిన్​పై రష్యా యుద్ధాన్ని కొనసాగించినన్ని రోజులు.. దానిని అడ్డుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తుంది."

తదుపరి వ్యాసం