'జెలెన్​స్కీ'తో పుతిన్​ కూతురు ప్రేమాయణం..!-putin daughter boyfriend name is zelensky claims report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'జెలెన్​స్కీ'తో పుతిన్​ కూతురు ప్రేమాయణం..!

'జెలెన్​స్కీ'తో పుతిన్​ కూతురు ప్రేమాయణం..!

HT Telugu Desk HT Telugu
May 20, 2022 11:03 AM IST

Putin daughter boyfriend | రష్యా ఉక్రెయిన్​ యుద్ధం వేళ.. జెలెన్​స్కీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఈ సమయంలో.. జెలెన్​స్కీతో రష్యా అధ్యక్షుడు పుతిన్​ కూతురు ప్రేమలో ఉన్నట్టు వార్తలు బయటకొచ్చాయి. అసలు కథ ఏంటంటే..

రష్యా అధ్యక్షుడు పుతిన్​
రష్యా అధ్యక్షుడు పుతిన్​ (AFP/file)

Putin daughter boyfriend | రష్యా ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో అనేక కథలు వార్తలకెక్కుతున్నాయి. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా.. ఇందుకు సంబంధించిన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. పుతిన్​ కూతురు కాటెరినా టిఖోనోవా.. జెలెన్​స్కీతో ప్రేమలో ఉన్నట్టు సమాచారం!

అయితే.. కాటెరినా టిఖోనోవా ప్రేమలో ఉన్న జెలెన్​స్కీ.. ఉక్రెయిన్​ అధ్యక్షుడు వ్లాదిమిర్​ జెలెన్​స్కీ కాదు. ఆక్రోబాట్​ డాన్సర్​గా గుర్తింపు పొందిన కాటెరినా టిఖోనోవా.. మునిచ్​కు చెందిన బాలెట్​ డాన్సర్​ ఇగోర్​ జెలెన్​స్కీతో ప్రేమాయణం నడిపిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా.. వారిద్దరికి ఓ సంతానం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

2018-2019 మధ్యలో పుతిన్​ కూతురు కాటెరినా టిఖోనోవా.. 50కన్నా ఎక్కువసార్లు మునిచ్​కు వెళ్లారని.. స్వతంత్ర రష్యా మీడియా సంస్థ ఐస్టోరీస్​, జర్మన్​ మ్యాగజైన్​ డేర్​ స్పైగెల్​ సంయుక్త దర్యాప్తులో తేలింది. కాగా.. ఆమె ప్రయాణాలన్నీ ప్రభుత్వ ఆధారిత విమానాల్లోనే జరిగినట్టు, అధ్యక్షుడి భద్రతా సిబ్బంది కాటెరినా టిఖోనోవా వెంటే వెళ్లినట్టు నివేదిక పేర్కొంది.

అయితే.. కాటెరినా టిఖోనోవాతో పాటు రెండేళ్ల చిన్నారికి సంబంధించిన పాస్​పోర్టు, టికెట్లు కూడా దర్యాప్తులో బయటపడ్డాయి. ఆ చిన్నారి.. పుతిన్​ మనవరాలు అయ్యి ఉండొచ్చని ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఎవరీ ఇగోర్​ జెలెన్​స్కీ..?

52ఏళ్ల ఇగోర్​ జెలెన్​స్కీ.. బయెరిషెస్​ స్టాట్స్​బాలెట్​ యూనిట్​కు గతంలో డైరక్టర్​గా ఉండేవారు. రష్యా ఉక్రెయిన్​ యుద్ధం ప్రారంభమైన నెల రోజుల అనంతరం ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత, కుటుంబ విషయాల కారణంగా పదవికి గుడ్​ బై చెబుతున్నట్టు ఆయన చెప్పడం గమనార్హం.

కాగా.. కాటెరినా టిఖోనోవా, జెలెన్​స్కీ, ఆ రెండేళ్ల చిన్నారి.. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? అన్న ప్రశ్నకు సమాధానం లభించలేదు.

మరోవైపు ఈ వ్యవహారంపై రష్యా ఇంకా స్పందించలేదు.

పుతిన్​ ఆరోగ్యంపై ఊహాగానాలు..

Putin health | పుతిన్​ ఆరోగ్యంపై ఇటీవలి కాలంలో ఊహాగానాలు జోరందుకున్నాయి. తాజాగా.. ఆయన కనిపించిన వీడియోలను పరిశీలిస్తే.. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది.  పుతిన్​కు బ్లడ్​ క్యాన్సర్​ ఉందని వార్తలు వస్తున్నాయి. పుతిన్​ అనారోగ్య విషయం బయటపడకుండా ఉండేందుకు క్రెమ్లిన్​ అన్ని చర్యలు చేపడుతోందని సమాచారం. ఆయన ఎప్పుడు ఎవరిని కలవాలి? ఎంత సమయం కేటాయించాలి? అన్న లెక్కలను క్రెమ్లిన్​లోని అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో పుతిన్​ ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్​ మేజర్​ జనరల్​ కైరిలో బుడనోవ్. పుతిన్​కు క్యాన్సర్​తో పాటు ఇతర వ్యాధులు ఉన్నాయని అన్నారు. ఆయన భౌతిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని ఆరోపించారు.

సొంత లాభాల కోసం తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారా? అని అడిగినప్పుడు.. 'ఇవి నిజాలు. సరైన సమాచారాన్ని సేకరించడమే నా పని. ఇలాంటివి.. నాకు తెలియకపోతే, ఇంకెవరికి తెలుస్తాయి?' అని చాలా ధీమాగా చెప్పారు కైరిలో బుడనోవ్.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్