తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rrb Technician Recruitment : నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. 9వేల పోస్టులకు రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ!

RRB Technician Recruitment : నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. 9వేల పోస్టులకు రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ!

Sharath Chitturi HT Telugu

09 March 2024, 11:11 IST

    • RRB Technician Recruitment 2024 apply online : ఆర్​ఆర్​బీ టెక్నీషియన్​ రిక్రూట్​మెట్​ డ్రైవ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ మొదలైంది. ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
ఆర్​ఆర్​బీ రిక్రూట్​మెంట్​ డ్రైవ్​ 2024..
ఆర్​ఆర్​బీ రిక్రూట్​మెంట్​ డ్రైవ్​ 2024.. (HT file)

ఆర్​ఆర్​బీ రిక్రూట్​మెంట్​ డ్రైవ్​ 2024..

RRB Technician Recruitment 2024 notification : నిరుద్యోగులకు గుడ్​ న్యూస్!. 9వేలకు పైగా పోస్టుల భర్తీ కోసం ఆర్​ఆర్​బీ (రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్​) సిద్ధమైంది. టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్-3లోని వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 9144 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 2024 మార్చి 9 నుంచి 2024 ఏప్రిల్ 8 వరకు (11:59 గంటలు) రిజిస్టర్​ చేసుకోవచ్చని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక నోటిఫికేషన్​లో తెలిపింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆర్​ఆర్​బీ అధికారిక వెబ్​సైట్​ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:-

  • టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్: 1092 పోస్టులు
  • టెక్నీషియన్ గ్రేడ్ 3: 8052 పోస్టులు

ఎంపిక విధానం:

ఆర్​ఆర్​బీ రిక్రూట్​మెంట్​ 2024లో భాగంగా.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్ష షెడ్యూల్, వేదికల సమాచారాన్ని ఆర్ఆర్​బీ వెబ్​సైట్​లో, ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా అర్హులైన అభ్యర్థులకు తగిన సమయంలో అందిస్తారు.

ఆర్​ఆర్​బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్- ఇలా అప్లై చేసుకోండి..

RRB Technician Recruitment 2024 syllabus : స్టెప్​ 1:- rrbapply.gov.in అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి.

స్టెప్​ 2:- ఆర్​ఆర్​బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024 కోసం దరఖాస్తు చేయడానికి లింక్ కోసం చూడండి.

స్టెప్​ 3:- అవసరమైన వివరాలను నింపండి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.

స్టెప్​ 4:- మీ వ్యక్తిగత సమాచారం సమీక్షించుకోండి.

స్టెప్​ 5:- అప్లికేషన్ ఫీజు చెల్లించండి.

స్టెప్​ 6:- తదుపరి అవసరాల కోసం ప్రింటౌట్​ తీసుకోండి.

సీబీఎస్ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్..

CBSE recruitment 2024 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ​) వివిధ గ్రూప్ ఏ, బీ, సీ కేటగిరీల్లో మొత్తం 118 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి 'ఆల్ ఇండియా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఇండియన్ సిటిజన్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సీబీఎస్ఈ ఇటీవలే ప్రకటించింది. ఒకవేళ ఎంపికైతే, అభ్యర్థులను భారతదేశంలో ఎక్కడైనా నియమించవచ్చని నోటీసులో పేర్కొన్నారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2024 మార్చి 12 నుంచి 2024 ఏప్రిల్ 11 వరకు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.gov.in ద్వారా తమ దరఖాస్తులను అందివచ్చు. అసిస్టెంట్ సెక్రటరీ, అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. విద్యార్హతలు, సూచనలు, ఫీజులు తదితర వివరాలను తెలియజేస్తూ సీబీఎస్ ఈ త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం