తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Marathon Polygraph Test On Aaftab: ఆఫ్తాబ్ పై 8 గంటల పాటు లై డిటెక్టర్ టెస్ట్

Marathon polygraph test on Aaftab: ఆఫ్తాబ్ పై 8 గంటల పాటు లై డిటెక్టర్ టెస్ట్

HT Telugu Desk HT Telugu

24 November 2022, 23:27 IST

  • Marathon polygraph test on Aaftab: శ్రద్ధ వాల్కర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆఫ్తాబ్ అమిన్ పూనావాలాపై గురువారం పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. ఆఫ్తాబ్ పై ఈ పరీక్ష నిర్వహించడం ఇది రెండో సారి.

ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఆఫ్తాబ్
ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఆఫ్తాబ్ (HT_PRINT)

ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఆఫ్తాబ్

లివిన్ పార్ట్ నర్ శ్రద్ధ వాల్కర్ ను దారుణంగా హత్య చేసిన ఆఫ్తాబ్ పై గురువారం రెండో సారి పాలిగ్రాఫ్ టెస్ట్(లై డిటెక్టర్ టెస్ట్) చేశారు. ఢిల్లీలోని రోహిణి ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఈ పరీక్ష నిర్వహించారు. శుక్రవారం మరోసారి ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

Marathon polygraph test on Aaftab: 8 గంటల పాటు..

ఆఫ్తాబ్ పై రోహిణి ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో మధ్యాహ్నం 12 గంటల నుంచి వరుసగా 8 గంటల పాటు ఈ పరీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆఫ్తాబ్ ను పోలీసులు దాదాపు 40 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. శ్రద్ధతో విబేధాలు, గొడవలు, ఆర్థిక సంబంధ విషయాలు, హత్య ప్రణాళిక, హత్య చేసిన విధానం, హత్య తరువాత ఏం చేశాడు?.. తదితర విషయాలపై పోలీసులు కూలంకశంగా ప్రశ్నించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా, శ్రద్ధను హత్య చేయాలని ముందే నిర్ణయించుకుని, ప్లాన్డ్ గా ఈ మర్డర్ చేశాడా? లేక కోర్టులో తాను చెప్పినట్లు కోపంలో ఆమెను చంపేశాడా? అనే విషయంపై కూడా ఆఫ్తాబ్ ను లోతుగా ప్రశ్నించారు. చంపిన తరువాత శరీర భాగాలను, శరీరాన్ని కట్ చేయడానికి వాడిన రంపం, కత్తులను ఎక్కడ వేశాడనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీశారు. ఆఫ్తాబ్ పై మంగళవారం కూడా కొద్ది సేపు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు.

Marathon polygraph test on Aaftab: 5 కత్తులు స్వాధీనం

మరోవైపు, ఆఫ్తాబ్ శ్రద్ధను హత్య చేసిన ఫ్లాట్ నుంచి పోలీసులు 5 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, వాటిని శ్రద్ద శరీరాన్ని కట్ చేయడానికి ఉపయోగించాడా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించడానికి వాటిని ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. మరోవైపు, ఈ దారుణ హత్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు. దోషులకు త్వరలోనే చట్ట ప్రకారం కఠిన శిక్ష పడుతుందన్నారు. కేసు దర్యాప్తులో ఢిల్లీ, ముంబై పోలీసుల మధ్య ఎలాంటి సమాచార లోపం లేదన్నారు.

తదుపరి వ్యాసం