తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Planning To Study Law?: ‘లా’ చదవాలనుకుంటున్నారా? ఇవే భారత్ లోని టాప్ 10 న్యాయ విద్యా సంస్థలు..

Planning to study law?: ‘లా’ చదవాలనుకుంటున్నారా? ఇవే భారత్ లోని టాప్ 10 న్యాయ విద్యా సంస్థలు..

HT Telugu Desk HT Telugu

09 January 2024, 14:19 IST

  • Planning to study law?: నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF), 2023 ప్రకారం దేశంలోని టాప్ 10 లా ఇన్‌స్టిట్యూషన్‌లు ఇవే. ఈ టాప్ 10 జాబితాలో హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ కూడా ఉంది.

నేషనల్ లా స్కూల్, బెంగళూరు
నేషనల్ లా స్కూల్, బెంగళూరు (Mint file)

నేషనల్ లా స్కూల్, బెంగళూరు

Planning to study law?: న్యాయశాస్త్రం ఇటీవలి సంవత్సరాలలో యువ గ్రాడ్యుయేట్లలో అత్యంత ప్రజాదరణ పొందుతోంది. అంతేకాదు, న్యాయశాస్త్రం చదవడం వల్ల నిజ జీవిత సమస్యలను హేతుబద్ధంగా అర్థం చేసుకునే నైపుణ్యం లభిస్తుంది. అదే సమయంలో మీ వాక్చాతుర్యం కూడా మెరుగుపడుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఇవే పారామీటర్స్

దేశంలో న్యాయ విద్య(Law) కు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. న్యాయ విభాగంలో వృత్తి, ఉద్యోగ అవకాశాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. కార్పొరేట్ సంస్థల్లో కూడా లా గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) భారత్ లో న్యాయ విద్యను బోధించే అత్యున్నత 10 విద్యా సంస్థల జాబితాను వెలువరించింది. టీచింగ్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్ (TLR), రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ (RPC), ఔట్ రీచ్ అండ్ ఇన్ క్లూజివిటీ (OI), గ్రాడ్యుయేషన్ ఔట్ కమ్ (GO), పర్సెప్షన్ (PERCEPTION).. వంటి బహుళ పారామీటర్లను ప్రాతిపదికగా తీసుకుని ఈ ర్యాంకింగ్స్ ను ఇచ్చారు.

టాప్ 10 లిస్ట్

2023లో న్యాయ విద్యను అందించే విద్యాసంస్థల్లో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచి, టాప్ మోస్ట్ గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. హైదరాబాద్ కు చెందిన నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా మూడో స్థానంలో నిలిచింది.

  1. నేషనల్ లా స్కూల్, బెంగళూరు
  2. నేషనల్ లా యూనివర్శిటీ, న్యూ ఢిల్లీ
  3. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్
  4. వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడిషియల్ సైన్సెస్, కోల్ కతా
  5. జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ
  6. సింబయాసిస్ లా స్కూల్, పూణే
  7. గుజరాత్ నేషనల్ లా యూనివర్శిటీ, గాంధీనగర్
  8. శిక్షా 'ఓ' అనుసంధన్, భువనేశ్వర్
  9. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్ పూర్
  10. బాబాషెబ్ భీమ్ రావ్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, లక్నో

తదుపరి వ్యాసం