తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pet Dog Shoots: తుపాకీ పేల్చిన పెంపుడు కుక్క.. వ్యక్తి మృతి.. ఎలా జరిగిందంటే!

Pet Dog Shoots: తుపాకీ పేల్చిన పెంపుడు కుక్క.. వ్యక్తి మృతి.. ఎలా జరిగిందంటే!

26 January 2023, 7:06 IST

    • Pet Dog Shoots: ఓ పెంపుడు కుక్క తుపాకీ పేల్చటంతో ఓ వ్యక్తి మృతి చెందారు. అసలు ఈ ఘటన ఎలా జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AFP)

ప్రతీకాత్మక చిత్రం

Pet Dog Shoots: ఓ పెంపుడు కుక్క తుపాకీ పేల్చింది. అనుకోకుండా గన్‍ ఫైర్ చేసింది. ఆ బుల్లెట్ కాస్త ఓ వ్యక్తి శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో అతడు మృతి చెందాడు. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం సమ్నర్ కౌంటీలో ఇది జరిగింది. ఈ విషయంపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తిని విచిత (Wichita)కు చెందిన జోసెఫ్ స్మిత్‍(30)గా పోలీసులు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఘటన జరిగిందిలా..

వారాంతంలో సరదాగా పెంపుడు కుక్కతో రైడ్‍కు వెళ్లారు ఇద్దరు వ్యక్తులు. పికప్ ట్రక్‍లో వెనక కుక్కను ఉంచుకొని.. డ్రైవర్ సహా మరో వ్యక్తి ముందు కూర్చున్నారు. ఆ సమయంలో ట్రక్ వెనక వైపు కుక్క పక్కనే రైఫిల్ (గన్) ఉంది. ఆ సమయంలో కుక్క అనుకోకుండా గన్‍పై కాలు వేసింది. దీంతో తుపాకీ ఫైర్ అయింది. దీంతో బుల్లెట్ నేరుగా ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తికి తగిలింది. దీంతో అతడు కన్నుమూశాడు. చనిపోయిన వ్యక్తిని జోసెఫ్ ఆస్టిన్ స్మిత్‍గా సమ్నర్ కౌంటీ షరీఫ్ పోలీసులు గుర్తించారు. ప్రమాదం వివరాలను వెల్లడించారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.

“పెంపుడు కుక్క.. రైఫిల్‍పై కాలు మోపటంతో.. ఆయుధం నుంచి బుల్లెట్ బయటికి వచ్చింది. ఫైర్ రౌండ్ (బుల్లెట్) ప్యాసింజర్ సీట్ల ఉన్న వ్యక్తి శరీరంలో దూసుకెళ్లింది. ఈ గాయంతో అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు” అని సమ్నర్ కౌంటీ షరీఫ్ కార్యాలయం వెల్లడించింది.

ఈ ఘటనలో మృతి చెందిన జోసెఫ్ స్మిత్.. బ్రౌన్స్ ప్లంబింగ్ సర్వీసెస్‍లో పని చేస్తుండేవాడని కేఎస్ఎన్.కామ్ రిపోర్ట్ వెల్లడించింది.

మరోవైపు, ఈ వారంలో అమెరికాలో మూడు కాల్పుల ఘటనలు జరిగాయి. గుర్తు తెలియని దుండగులు ఈ దురాగతాలకు ఒడిగట్టారు. కాలిఫోర్నియాలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనలో ఏడు మంది మృతి చెందారు. వాషింగ్టన్ స్టేట్‍లోని యకిమాలో ఓ స్టోర్ లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు.

తదుపరి వ్యాసం