తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Parliament Winter Session: డిసెంబర్ 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

Parliament Winter Session: డిసెంబర్ 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

HT Telugu Desk HT Telugu

10 November 2023, 20:00 IST

  • Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, 2023 డిసెంబర్ 4 నుంచి ప్రారంభమై డిసెంబర్ 22 వరకు, అంటే 19 రోజుల పాటు జరగనున్నాయి. మొత్తంగా 15 సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ సమావేశాలు డిసెంబర్ 4వ తేదీ నుంచి డిసెంబర్ 22 వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. 19 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో, సెలవులు మినహాయిస్తే, మొత్తం 15 సిట్టింగ్స్ ఉంటాయని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

మహువా మొయిత్రా అంశం

లోక్ సభలో ప్రశ్న అడగడానికి డబ్బులు తీసుకున్నారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ జరిపిన విచారణ కు సంబంధించిన నివేదికను ఈ సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టనున్నారు. ఎంపీ మహువా మొయిత్రాను అనర్హురాలిగా ప్రకటించాలన్న ఎథిక్స్ కమిటీ సిఫారసులను లోక్ సభ ఆమోదం తెలుపుతుందా? లేదా? అన్న ఉత్కంఠ ఇప్పుడు నెలకొన్నది.

కీలక బిల్లులు

ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు కూడా ఉభయ సభల ముందుకు రానున్నాయి. వాటిలో ఐపీసీ, సీఆర్ పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ల స్థానంలో మూడు కీలక బిల్లులను ఈ సెషన్‌లో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. హోం శాఖకు చెందిన స్థాయి సంఘం ఇప్పటికే వీటిని ఆమోదించింది. అలాగే, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మరో కీలక బిల్లు కూడా పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. గత వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. కానీ, దీనిపై ప్రతిపక్షాలు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సీఈసీ, ఈసీలు ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల హోదాను పొందుతున్నారు. ప్రభుత్వం తీసుకువస్తున్న సవరణ బిల్లులో ఆ హోదాను కేబినెట్ సెక్రటరీ హోదాగా మార్చే ప్రతిపాదనను చేర్చారు.

తదుపరి వ్యాసం