తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Parliament Budget Session : పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం..

Parliament budget session : పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం..

31 January 2023, 11:38 IST

    • Parliament budget session : పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి.. రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు.
బడ్జెట్​ సమావేశాల నేపథ్యంలో ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
బడ్జెట్​ సమావేశాల నేపథ్యంలో ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

బడ్జెట్​ సమావేశాల నేపథ్యంలో ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Parliament budget session : దేశంతో పాటు ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్న పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్​ సమావేశాలపై ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ప్రధాని మోదీ, సోనియా గాంధీతో పాటు అనేక మంది ఎంపీలు.. బడ్జెట్​ సమావేశాల తొలి రోజు నాడు పార్లమెంట్​కు వెళ్లి, రాష్ట్రపతి ప్రసంగాన్ని వీక్షించారు.

'భారత్​.. మెరుగైన స్థితిలో ఉంది'

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాల్లో తొలిసారిగా ప్రసంగించారు రాష్ట్రపతి ముర్ము. దేశాభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సంకల్పాన్ని వివరించారు.

President speech in Parliament budget session : "ప్రపంచంలో ఎక్కడ రాజకీయ అనిశ్చితి ఉన్నా.. ఆయా దేశాల్లో సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంటుంది. కానీ ఇండియాలో పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి. దేశాభివృద్ధి, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుండటమే ఇందుకు కారణం. సమాజంలోని ప్రతి వర్గాని చేరువయ్యే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తోంది. ఎక్కడా వివక్ష చూపించడం లేదు. కనీస వసతుల్లో చాలావరకు.. 100శాతం జనాభాకు చేరువయ్యాయి. ఇంకొన్ని చేరువలో ఉన్నాయి. జల్​ జీవన్​ మిషన్​లో భాగంగా.. మూడేళ్లల్లో 11కోట్ల కుటుంబాలకు నీటి సరఫరా లభిస్తోంది. దీనితో పేద కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి. ఇక ఆర్టికల్​ 370, ట్రిపుల్​ తలాక్​ రద్దుతో మా ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంది. సర్జికల్​ స్ట్రైక్​తో పాటు ఎల్​ఏసీ వెంబడి ప్రత్యర్థులకు సరైన బుద్ధి చెబుతోంది. సమస్యలను పరిష్కరించే విషయంలో మన ప్రభుత్వానికి మంచి గుర్తింపు ఉంది," అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

'ప్రపంచం.. భారత్​ బడ్జెట్​వైపు చూస్తోంది'

PM Modi on budget 2023 : అంతకుముందు.. పార్లమెంట్​కు చేరుకున్న మోదీ.. బడ్జెట్​ సమావేశాలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు.

"పార్లమెంట్​లో కొత్త ఎంపీలు తొలిసారిగా మాట్లాడుతుంటే.. వారికి గౌరవం ఇస్తాము. మంచి వాతావరణాన్ని అందిస్తాము. రాష్ట్రపతి విషయంలోనూ ఇదే జరగాలి. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముకు ఇదే మొదటి బడ్జెట్​ ప్రసంగం. రేపు బడ్జెట్​ను ప్రవేశపెట్టబోయే నిర్మలా సీతారామన్​ కూడా ఒక మహిళే. ఇక మన బడ్జెట్​ కోసం భారతీయులే కాదు.. యావత్​ ప్రపంచం ఎదురుచూస్తోంది. అస్తవ్యవస్థంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో.. మన బడ్జెట్​ అత్యంత ఆకర్షణీయమైన స్థాయికి చేరుతుంది. నిర్మలా సీతారామన్​.. మన అంచనాలను అందుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది," అని ప్రధాని మోదీ అన్నారు.

Budget 2023 live updates : "మాకు ఎప్పుడూ దేశమే ముందు ఉంటుంది. దేశాన్ని దృష్టిలో పెట్టుకునే మేము నిర్ణయాలు తీసుకుంటాము. బడ్జెట్​ సెషన్​లోనూ మంచిగా చర్చలు జరుపుతాము. ప్రతి సమస్యపై సభలో చర్చలు జరుపుతాము. ఈ సెషన్​ అందరికీ ఎంతో కీలకం," అని మోదీ స్పష్టం చేశారు.

ఇక సర్వత్రా చర్చ జరుగుతున్న కేంద్ర బడ్జెట్​ను ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టనున్నారు. ఆమె ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తదుపరి వ్యాసం