తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Omicron Bf.7: చైనా బీఎఫ్ 7 వేరియంట్ తో భారత్ లో మరో వేవ్ ముప్పు ఉందా?

Omicron BF.7: చైనా బీఎఫ్ 7 వేరియంట్ తో భారత్ లో మరో వేవ్ ముప్పు ఉందా?

HT Telugu Desk HT Telugu

21 December 2022, 20:18 IST

  • Omicron BF.7: చైనాలో కేసుల భాారీ పెరుగుదల కు కారణమైన కరోనా వైరస్ వేరియంట్ భారత్ లోనూ కనిపించడం ఆందోళనకు కారణమవుతోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Pixabay)

ప్రతీకాత్మక చిత్రం

Omicron BF.7 : చైనాలో భారీగా కరోనా (corona) కేసులు నమోదవుతున్నాయి. అనధికారిక సమాచారం మేరకు, చైనాలో కోవిడ్(covid) మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దేశంలోని వైద్య వ్యవస్థ కూడా కుప్పకూలిన పరిస్థితి నెలకొన్నది. చైనాలో ఆసుపత్రుల్లో కోవిడ్(covid) బాధితుల చేరికలు పెరగడం, ఆసుపత్రుల కారిడార్లలో మృతదేహాలను పేర్చడం, స్మశాన వాటికల వద్ద రద్దీ, అంత్యక్రియల సేవలకు అనూహ్యంగా పెరిగిన భారీ డిమాండ్.. మొదలైన వార్తలకు సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Omicron BF.7 : ఒమిక్రాన్ బీఎఫ్ 7తో మరో వేవ్?

ప్రస్తుతం చైనాలో కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరగడానికి కారణం కరోనా వైరస్ ఒమిక్రాన్ బీఎఫ్ 7(Omicron BF.7) సబ్ వేరియంట్(Omicron BF.7) అని భావిస్తున్నారు. భారత్ లోనూ ఆ Omicron BF.7 వేరియంట్ కనిపించడం మన దేశంలోని వైద్యులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు గుజరాత్ లో 2, ఒడిశాలో ఒకటి ఈ వేరియంట్ కు సంబంధించిన కేసులను గుర్తించారు. గుజరాత్ లో అక్టోబర్ నెలలోనే ఈ Omicron BF.7 ను గుర్తించారు. ఈ వేరియంట్ ఇప్పుడు భారత్ లోనూ మరో వేవ్ కు కారణమవుతుందా? అన్న ప్రశ్న వైద్య నిపుణులను వేధిస్తోంది. Omicron BF.7 వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా తక్కువే. అంటే, వైరస్ సోకిన రెండు రోజుల్లోనే లక్షణాలు ప్రారంభమవుతాయి. అంతర్జాతీయంగా ప్రయాణాలు కరోనా ముందునాటి స్థాయికి చేరిన కారణంగా ఈ Omicron BF.7 వైరస్ కూడా ప్రపంచమంతా వ్యాపించే ముప్పు ఉందని గురుగ్రామ్ లోని సీకే బిర్లా హాస్పిటల్ లోని సీనియర్ వైద్యుడు రవీంద్ర గుప్తా హెచ్చరిస్తున్నారు.

Omicron BF.7 : వ్యాపించే వేగం అత్యధికం..

ఈ Omicron BF.7 వైరస్ వ్యాపించే వేగం ఇప్పటివరకు వచ్చిన ఏ వేరియంట్ కన్నా అత్యధికమని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తి చుట్టూ ఉన్న వారిలో 10 నుంచి 18 మందికి ఈ వైరస్ సోకుతుందని చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారు, వృద్ధులు, పిల్లలు, డయాబెటిస్, కిడ్నీ, హార్ట్ సమస్యలు ఉన్నవారికి ఈ వేరియంట్ తో ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే, సాధారణ ప్రజల్లో ఈ Omicron BF.7 వేరియంట్ తో మరణం సంభవించే అవకాశం చాలా తక్కువ అని వివరిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకోవడం వల్ల కొంతవరకు ఉపయోగం ఉంటుందని డాక్టర్ గుప్తా తెలిపారు.

OMICRON BF.7 SYMPTOMS: లక్షణాలు

ఈ Omicron BF.7 వేరియంట్ తో కూడా జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి సాధారణ లక్షణాలే ఉంటాయి. కొందరిలో కడుపు నొప్పి, విరోచనాలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. చైనాలో ఈ Omicron BF.7 వేరియంట్ కారణంగా కనీసం 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని అక్కడి వైద్య నిపుణుడు ఒకరు ఇటీవల ప్రకటించారు. ఈ Omicron BF.7 వైరస్ బారిన పడకుండా ఉండాలంటే కోవిడ్ ప్రొటొకాల్ ను కచ్చితంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. రెగ్యులర్ గా చేతులు శుభ్రం చేసుకోవడం, సానిటైజర్ వాడడం, మాస్క్ ధరించడం, ఇతరులతో కనీస దూరం పాటించడం, టీకా వేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Omicron BF.7 : భారత్ కు ముప్పు ఉందా?

ఈ Omicron BF.7 వేరియంట్ తో భారత్ కు ముప్పు ఉండకపోవచ్చనే వైద్య నిపుణులు భావిస్తున్నారు. భారత్ లో అత్యధిక శాతం ప్రజలు రెండు డోసుల టీకా వేసుకుని ఉండడంతో పాటు, కరోనా రెండో వేవ్ సమయంలో మెజారిటీ ప్రజలకు కరోనా సోకిన కారణంగా వారిలో ఇమ్యూనిటీ వచ్చిందని తెలిపారు. ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ వేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం