తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet-pg Exam : జులై మొదటి వారంలో నీట్​ పీజీ పరీక్ష..!

NEET-PG exam : జులై మొదటి వారంలో నీట్​ పీజీ పరీక్ష..!

Sharath Chitturi HT Telugu

07 January 2024, 11:15 IST

    • NEET-PG exam : ఈ ఏడాది జులై మొదటి వారంలో నీట్​ పీజీ పరీక్ష జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
NEET-PG likely in first week of July
NEET-PG likely in first week of July (ANI)

NEET-PG likely in first week of July

NEET-PG exam : నీట్- పీజీ​ ( నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్ష) జూలై మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. కౌన్సిలింగ్ ప్రక్రియ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం అవ్వొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో.. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (ఎన్​ఈటీ) ఈ ఏడాది జరగదని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

“జూలై మొదటి వారంలో నీట్-పీజీ 2024 పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఆగస్టు మొదటి వారంలో కౌన్సిలింగ్ ఉంటుంది,” అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

NEET-PG exam date : పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్జ్యుకేషన్ (సవరణ) రెగ్యులేషన్స్ 2018 స్థానంలో.. ఇటీవలే నోటిఫై అయిన "పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్జ్యుకేషన్ రెగ్యులేషన్స్, 2023" ప్రకారం, పీజీ అడ్మిషన్ కోసం ప్రతిపాదిత ఎన్​ఈటీ అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుత నీట్-పీజీ పరీక్ష కొనసాగుతుంది.

నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 ప్రకారం.. వివిధ ఎండీ/ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఒకే ప్రవేశ పరీక్షగా నిర్దేశించిన ఎలిజిబిలిటీ కమ్ ర్యాంకింగ్ పరీక్ష ఈ నీట్-పీజీ.

NEET-PG exam postponed : ఈ నీట్​ పీజీ కోసం వైద్య విద్యార్థులు తీవ్రంగా కృషి చేస్తారు. ఇందులో మంచి ర్యాంక్​ వస్తే టాప్​ మెడికల్​ కాలేజీల్లో చదువుకునే అవకాశం ఉంటుంది.

మరోవైపు నీటీ పీజీ 2024కి సంబంధించి నోటిఫికేషన్​ ఆదివారం వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గతేడాది జనవరి 7నే.. నీట్​ పీజీ 2023 నోటిఫికేషన్​ బయటకు రావడం ఇందుకు కారణం. దీనిపై అధికారులు ఇంకా స్పందించలేదు. రిజిస్ట్రేషన్​కి సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే బయటకి వస్తాయని సమాచారం.

ఈ ఏడాది జరిగే నీట్​ పీజీ పరీక్షతో.. 19953 ఎండీ, 10821 ఎంఎస్​, 1979 పీజీ డిప్లొమా, 1338 డీఎన్​బీ సీఈటీ సీట్లను భర్తి చేస్తారు.

తదుపరి వ్యాసం