తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Mds 2024: నీట్ ఎండీఎస్ 2024 నోటిఫికేషన్ విడుదల; అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 19..

NEET MDS 2024: నీట్ ఎండీఎస్ 2024 నోటిఫికేషన్ విడుదల; అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 19..

HT Telugu Desk HT Telugu

30 January 2024, 21:06 IST

  • NEET MDS 2024: దంత విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు అవకాశం కల్పించే నీట్ ఎండీఎస్ 2024 నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 30వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నీట్ ఎండీఎస్ 2024 నోటిఫికేషన్ ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) మంగళవారం విడుదల చేసింది. నీట్ ఎండీఎస్ 2024 దరఖాస్తు ప్రక్రియ జనవరి 30వ తేదీన ప్రారంభమైంది. ఈ ప్రవేశ పరీక్షకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 2024 ఫిబ్రవరి 19. అర్హులైన అభ్యర్థులు ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్ natboard.edu.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మార్చి 18న నీట్ ఎండీఎస్ 2024

నీట్-ఎండీఎస్ 2024 (NEET MDS 2024) పరీక్ష ఈ సంవత్సరం మార్చి 18వ తేదీన జరుగుతుంది. ఈ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత ప్లాట్ ఫామ్ పై ఈ పరీక్ష జరుగుతుంది. నీట్ ఎండీఎస్ 2024 హాల్ టికెట్లను మార్చి 13న విడుదల చేయనున్నారు. నీట్ ఎండీఎస్ 2024 ఫలితాలు ఏప్రిల్ 18న విడుదల కానున్నాయి. ఈ పరీక్ష (NEET MDS 2024 EXAM pattern) లో 240 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్స్ ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు

నీట్ ఎండీఎస్ 2024కు అప్లై చేసే అభ్యర్థులు రూ. 3500 లను దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.2500 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఫీజును ఆన్ లైన్ లోనే చెల్లించాలి. క్రెడిట్, లేదా డెబిట్ కార్డ్ లతో కాని, ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ విధానం ద్వారా కానీ ఈ ఫీజును చెల్లించవచ్చు.

ఇలా అప్లై చేయండి..

నీట్ ఎండీఎస్ 2024కు అప్లై చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

  • ముందుగా అధికారిక వెబ్ సైట్ natboard.edu.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో కనిపిస్తున్న నీట్ ఎండీఎస్ 2024 (NEET MDS 2024) లింక్ పై క్లిక్ చేయాలి.
  • స్క్రీన్ పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • అక్కడ కనిపిస్తున్న అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
  • పరీక్ష ఫీజు చెల్లించాలి.
  • అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్తు రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోండి.

ఇంకా ఏవైనా సందేహాలుంటే ఎన్బీఈఎంఎస్ క్యాండిడేట్ కేర్ సపోర్ట్ మొబైల్ నంబర్ +91-7996165333 కాల్ చేయవచ్చు. లేదా నోటిఫికేషన్ లో ఉన్న హెల్ప్ లైన్ లను సంప్రదించవచ్చు.

తదుపరి వ్యాసం