తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Separate Ministry For Nris: కర్నాటకలో ఎన్నారైల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ

Separate ministry for NRIs: కర్నాటకలో ఎన్నారైల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ

HT Telugu Desk HT Telugu

22 February 2024, 15:43 IST

  • Separate ministry for NRIs: విదేశాల్లో నివసిస్తున్న కర్నాటక పౌరులకు సేవలను అందించే లక్ష్యంతో కర్నాటకలో త్వరలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కర్నాటక హోం మంత్రి జీ పరమేశ్వర గురువారం అసెంబ్లీలో ప్రకటించారు.

కర్నాటక హోం మంత్రి జీ పరమేశ్వర
కర్నాటక హోం మంత్రి జీ పరమేశ్వర

కర్నాటక హోం మంత్రి జీ పరమేశ్వర

Separate ministry for Karnataka NRIs: కర్నాటకకు చెందిన ఎన్నారైల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకునే దిశగా కర్నాటక హోం మంత్రి జీ పరమేశ్వర అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. త్వరలో ఎన్ఆర్ఐ (ప్రవాస భారతీయ) కన్నడిగుల వ్యవహారాలను చూసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తుందని ఆయన శాసనసభకు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఎన్నారైల సమక్షంలోనే..

స్పీకర్ యూటీ ఖాదర్ ఆహ్వానం మేరకు అసెంబ్లీ కార్యకలాపాలను వీక్షించేందుకు ఈ రోజు విధానసౌధకు వచ్చిన ఎన్నారైలకు హోం మంత్రి జీ పరమేశ్వర స్వాగతం పలికారు. కెనడా, యునైటెడ్ కింగ్ డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, పశ్చిమాసియా దేశాల్లో నివసిస్తున్న కర్నాటక ఎన్నారైలు అసెంబ్లీకి వచ్చిన వారిలో ఉన్నారు. వారు ప్రేక్షకుల గ్యాలరీలో ఉండగానే, కర్నాటక ఎన్నారైల కోసం ప్రత్యేక మినిస్ట్రీని ఏర్పాటు చేస్తామని పరమేశ్వర ప్రకటించారు.

కేరళ తరహాలో

"కేరళలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ఎన్ ఆర్ ఐ మంత్రిత్వ శాఖ ఉంది, కేరళ నుండి చాలా మంది విదేశాలకు వెళతారు. వారు అక్కడ సంపాదించి డబ్బును తిరిగి పంపుతారు. అలాగే విదేశాల్లో మరణించినవారి మృతదేహాలను తిరిగి తీసుకురావడానికి అనేక సమస్యలు ఎదురవుతాయి. అందుకే కేరళలో మాదిరిగానే కర్ణాటకలో కూడా ఎన్ఆర్ఐల కోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పాం' అని పరమేశ్వర తెలిపారు. రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఆ పని (ఎన్ఆర్ఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తుంది) అని నేను చెప్పాలనుకుంటున్నాను. చట్టప్రకారం వారికి (ఎన్ఆర్ఐలకు) అవసరమైన అన్ని రకాల సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అలాగే, కర్నాటక ఎన్నారైలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పరమేశ్వర 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి నేతృత్వం వహించారు.

ఎన్నారై పెట్టుబడులు

భారతదేశానికి తిరిగి వచ్చి దేశాభివృద్ధికి దోహదపడటానికి ఎన్ ఆర్ ఐలు ఆసక్తి చూపుతున్నారని మంత్రి పరమేశ్వర వ్యాఖ్యానించారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారన్నారు. 2008 లోనే కర్ణాటక ప్రభుత్వం వారి సమస్యలు, ఆందోళనల పరిష్కారం కోసం ఎన్నారై ఫోరంను ఏర్పాటు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం డాక్టర్ ఆర్తి కృష్ణను ఫోరం డిప్యూటీ చైర్మన్ గా నియమించిందని ఆయన తెలిపారు. కాగా, రాష్ట్రంలోని ఎన్నారైల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ కుమార్ రాయ్ డిమాండ్ చేశారు.

తదుపరి వ్యాసం