తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kangana Ranaut : కంగనా రనౌత్​ బీఫ్​ తింటారా? ఆమె సమాధానం ఇది..

Kangana Ranaut : కంగనా రనౌత్​ బీఫ్​ తింటారా? ఆమె సమాధానం ఇది..

Sharath Chitturi HT Telugu

08 April 2024, 17:29 IST

  • Kangana Ranaut Beef : తాను బీఫ్​ తింటానని వస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పిందించారు కంగనా రనౌత్​. హిందుత్వం, జై శ్రీరామ్​ అంటూ ట్వీట్​ చేశారు.

2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్​పై పోటీ చేస్తున్నారు కంగనా రనౌత్​
2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్​పై పోటీ చేస్తున్నారు కంగనా రనౌత్​

2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్​పై పోటీ చేస్తున్నారు కంగనా రనౌత్​

Kangana Ranaut Lok Sabha elections : 2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్​ పొందినప్పటి నుంచి.. ప్రముఖ నటి కంగనా రనౌత్​ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె బీఫ్​ తింటారని.. విపక్ష పార్టీ నేతల్లో కొందరు ఆరోపించారు. తాజాగా.. ఆ ఆరోపణలను కొట్టిపారేశారు కంగనా రనౌత్​. ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.

కంగనా రనౌత్​ బీఫ్​ తింటారా?

కంగనా రనౌత్​ బీఫ్​ తింటారని.. ఏప్రిల్​ 5న ఆరోపించారు మహారాష్ట్ర కాంగ్రెస్​ నేక విజయ్​ వాడెట్టివర్​.

"నటి కంగనా రనౌత్​కి బీఫ్​ ఇష్టమని, తింటానని ఆమె ఒకసారి చెప్పారు. ఆమెకు 2024 లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్​ ఇచ్చింది. అవనీతిపరులైన నేతలకు బీజేపీ స్వాగతం పలుకుతోంది," అని విజయ్​ చెప్పుకొచ్చారు.

విజయ్​ ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కంగనా రనౌత్​.

2024 Lok Sabha elections : "యోగిక్​, ఆయుర్వేద జీవితాన్ని అనుసరించాలని నేను అందరికి చెబుతున్నాను. నా పరువును దెబ్బతీసేందుకు ఇలాంటి ప్లాన్స్​ పనిచేయవు. నా గురించి నా ప్రజలకు బాగా తెలుసు. హిందువుగా ఉండటాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను. నేను ఎప్పుడు బీఫ్​ తినలేదు. ఎలాంటి రెడ్​ మీట్​ని ముట్టుకోలేదు. నా గురించి తెలిసిన వారిని ఎప్పుడు తప్పుదోవ పట్టించలేరు. జై శ్రీరామ్​," అని ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు కంగనా రనౌత్​. ఇలాంటి ఆరోపణల్లో నిజం లేదని, ఈ మాటలు సిగ్గు చేటు అని అభిప్రాయపడ్డారు.

విజయ్​ చేసిన ఆరోపణలపై మహారాష్ట్ర బీజేపీ ప్రతినిథి కేశవ్​ ఉపాధ్యాయ సైతం స్పందించారు.

"ఇది కాంగ్రెస్​ నీచ రాజకీయాలు, నీచ ఆచారాలకు ప్రతిబింబం. ఇది పార్టీ మనస్తత్వానికి ప్రతీక," అని కేశవ్​ చెప్పుకొచ్చారు.

Kangana Ranaut latest news : ఇక 2024 లోక్​సభ ఎన్నికల విషయానికొస్తే.. హిమాచల్​ ప్రదేశ్​ మండీ నుంచి కంగనా రనౌత్​ పోటీ చేస్తున్నారు. జూన్​ 1న ఇక్కడ ఎన్నికలు జరగుతాయి. జూన్​ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇక కంగనా రనౌత్​కు పోటీగా.. లోక్​సభ ఎన్నికల్లో.. హిమాచల్​ ప్రదేశ్​ ప్రస్తుత పబ్లిక్​ వర్క్​ డెవలప్​మెంట్​, అర్బన్​ డెవలప్​మెంట్​ మంత్రి వికమాదిత్య సింగ్​ని బరిలో దింపేందుకు కాంగ్రెస్​ ప్రణాళికలు రచిస్తోందని వార్తలు వస్తున్నాయి. మండీ నియోజకవర్గానికి.. ఆయన తల్లి ప్రతిభా సింగ్​ ఎంపీగా ఉన్నారు.

తదుపరి వ్యాసం