తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  నుపుర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా కంగ‌న‌, నెద‌ర్లాండ్స్‌ ఎంపీ..

నుపుర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా కంగ‌న‌, నెద‌ర్లాండ్స్‌ ఎంపీ..

HT Telugu Desk HT Telugu

08 June 2022, 15:23 IST

  • మొహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై ఒక వైపు సొంత పార్టీ స‌హా దేశ విదేశాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతుండ‌గా.. మ‌రోవైపు, అనూహ్య వ‌ర్గాల నుంచి ఆమెకు మ‌ద్ద‌తు కూడా ల‌భిస్తుంది. తాజాగా, బాలీవుడ్ న‌టి కంగ‌న ర‌నౌత్, డ‌చ్ ఎంపీ గీర్ట్ వైల్డ‌ర్స్‌ నుపుర్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

బాలీవుడ్ న‌టి కంగ‌న ర‌నౌత్ (ఫైల్ ఫొటో)
బాలీవుడ్ న‌టి కంగ‌న ర‌నౌత్ (ఫైల్ ఫొటో) (PTI)

బాలీవుడ్ న‌టి కంగ‌న ర‌నౌత్ (ఫైల్ ఫొటో)

మొహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై చేసిన అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నుపుర్ శ‌ర్మ‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌కు పార్టీతో కానీ, ప్ర‌భుత్వంతో కానీ ఎలాంటి సంబంధం లేద‌ని తేల్చిచెప్పింది. అయితే, బీజేపీలోనే ఆమెపై సానుభూతి వ్య‌క్త‌మ‌వుతోంద‌ని, ఒక ప్ర‌త్యేక సంద‌ర్భంలో, హిందుత్వానికి గ‌ట్టిగా మ‌ద్ద‌తు తెల‌ప‌డానికే ఆమె అలా మాట్లాడార‌న్న వాద‌న సొంత పార్టీలోనే వినిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

కంగ‌న స‌పోర్ట్‌..

బాలీవుడ్ న‌టి, సంచ‌ల‌న వ్యాఖ్య‌లకు కేరాఫ్‌గా నిలిచే కంగ‌న ర‌నౌత్ తాజాగా నుపుర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. త‌ప్పు చేశాన‌ని భావించాల్సిన అవ‌స‌రం లేద‌ని నుపుర్‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. అవ‌స‌ర‌మైతే కోర్టుకు వెళ్లాల‌ని సూచించారు. త‌న ఇన్‌స్టా స్టోరీ సెక్ష‌న్‌లో `నుపుర్‌కు త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసే హ‌క్కు ఉంది. ఇప్పుడు అంద‌రూ ఆమెను బెదిరిస్తున్నారు. ప్ర‌తీరోజు వాళ్లు హిందూ దేవుళ్ల‌ను అవ‌మానించిన‌ప్పుడు ఏం చేశాం? కోర్ట‌కు వెళ్లాం క‌దా! ఇప్పుడు నుపుర్ కూడా అదే ప‌ని చేయాలి` అని కంగ‌న సూచించారు. ఇది అఫ్గానిస్తాన్ కాద‌ని, ఇక్క‌డ ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఏర్పాటైన ప్ర‌జా ప్ర‌భుత్వం ఉంద‌న్న విష‌యాన్ని అంద‌రూ గుర్తుంచుకోవాల‌ని కంగ‌న వ్యాఖ్యానించారు.

<p>నెద‌ర్లాండ్స్‌ ఎంపీ గీర్ట్ వైల్డ‌ర్స్</p>

డ‌చ్ ఎంపీ కూడా..

అనూహ్యంగా నెద‌ర్లాండ్స్ మంత్రి కూడా నుపుర్‌కు మద్ద‌తు ప్ర‌క‌టించ‌డం విశేషం. మొహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై అన్ని వైపుల నుంచి నుపుర్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతుండ‌గా, అనూహ్యంగా నెద‌ర్లాండ్స్‌ ఎంపీ గీర్ట్ వైల్డ‌ర్స్ ఆమెకు బాస‌ట‌గా నిలిచారు. అల్‌కాయిదా వంటి ఆట‌విక ఉగ్ర‌వాద సంస్థ‌ల‌ హెచ్చ‌రిక‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న భార‌త్‌కు సూచించారు. మొహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా భార‌త్‌లో ఆత్మాహుతి దాడులు చేస్తామ‌ని అల్ కాయిదా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. నుపుర్ శ‌ర్మ త‌ప్పేం చేయ‌లేద‌ని, ఆమె చేసిన వ్యాఖ్య‌ల్లో నిజ‌ముంద‌ని డ‌చ్ ఎంపీ గీర్ట్ వైల్డ‌ర్స్‌ వ్యాఖ్యానించారు. ఆ కామెంట్స్‌పై ఇస్లామిక్ దేశాల స్పంద‌న హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. బుజ్జ‌గింపుల‌తో ప‌ని కాద‌ని, దానివ‌ల్ల ప‌రిస్థితి మ‌రింత క్లిష్ట‌మ‌వుతుంద‌ని భార‌త ప్ర‌భుత్వానికి స‌ల‌హా ఇచ్చారు. `బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌కండి. మీ నాయ‌కురాలి(నుపుర్ శ‌ర్మ‌) వ్యాఖ్య‌ల‌కు గ‌ర్వ‌ప‌డండి. ఆమెకు మ‌ద్ద‌తుగా నిల‌వండి` అని సూచించారు. గీర్ట్ వైల్డ‌ర్స్ త‌న ఇస్లాం వ్య‌తిరేక‌త‌ను బ‌హిరంగంగానే వ్య‌క్త ప‌రుస్తుంటారు. నెద‌ర్లాండ్స్‌లో ఆయ‌న స్థాపించిన `పార్టీ ఫ‌ర్ ఫ్రీడం` మూడో అతి పెద్ద పార్టీ. 1988 నుంచి ఆయ‌న ఎంపీగా ఉంటున్నారు.

22న పోలీసుల ముందుకు

మొహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన నుపుర్ శ‌ర్మ‌ను జూన్ 22న‌ త‌మ ముందు హాజ‌రు కావాల‌ని పోలీసులు ఆదేశించారు. ఆమెపై ఇప్ప‌టికే కేసు న‌మోదు కాగా, జూన్ 22న ఆమె నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకోనున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం