తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెషన్ 2: రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం

జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెషన్ 2: రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం

HT Telugu Desk HT Telugu

01 February 2024, 14:49 IST

    • JEE Mains Exam 2024 Session 2: జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెషన్ 2 రిజిస్ట్రేషన్ 2024 ఫిబ్రవరి 2న ప్రారంభం కానుంది. దరఖాస్తు ప్రక్రియ ఇక్కడ తెలుసుకోండి.
JEE Mains Exam 2024 Session 2: రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటి నుంచే..
JEE Mains Exam 2024 Session 2: రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటి నుంచే..

JEE Mains Exam 2024 Session 2: రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటి నుంచే..

జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెషన్ 2 రిజిస్ట్రేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఫిబ్రవరి 2, 2024 న ప్రారంభించనుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సెషన్ 2కు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 2 మార్చి 2024. దరఖాస్తు ఫీజును చెల్లించడానికి గడువు మార్చి 2 వరకు ఉంది. సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ 2024 మార్చి మూడో వారంలో అందుబాటులో ఉంటుందని, పరీక్ష తేదీకి 3 రోజుల ముందు అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్షను 2024 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహిస్తారు. ఫలితాలను 2024 ఏప్రిల్ 25న ప్రకటిస్తారు.

జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెషన్ 2 దరఖాస్తు

జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెషన్ 2 రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ అనుసరించాలి.

  • ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెషన్ 2 లింక్‌పై క్లిక్ చేయండి.
  • ఇక రిజిస్టర్ చేసుకోండి. ఖాతాలోకి లాగిన్ అవ్వండి.
  • అప్లికేషన్ ఫారమ్ నింపి ఫీజు చెల్లించాలి.
  • సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపరుచుకోండి.

రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇకపై సెషన్ 2కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అభ్యర్థులు సెషన్ 2కు దరఖాస్తు చేయాలనుకుంటే రేపటి నుంచి లాగిన్ అయి సెషన్ 2 పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.

తదుపరి వ్యాసం