తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Irctc Northeast India Tour Package : ఈశాన్య భారతం చూడాలని ఉందా? ఇదిగో ప్యాకేజీ

IRCTC Northeast India tour package : ఈశాన్య భారతం చూడాలని ఉందా? ఇదిగో ప్యాకేజీ

Sharath Chitturi HT Telugu

10 September 2022, 7:55 IST

    • IRCTC Northeast air tour package : ఈశాన్య భారతానికి ఎయిర్​ టూర్​ని ప్రకటించింది ఐఆర్​సీటీసీ. ఆ వివరాలను ఇక్కడ చూడండి.
ఈశాన్య భారతం చూడాలని ఉందా? ఇదిగో ప్యాకేజీ
ఈశాన్య భారతం చూడాలని ఉందా? ఇదిగో ప్యాకేజీ

ఈశాన్య భారతం చూడాలని ఉందా? ఇదిగో ప్యాకేజీ

IRCTC Northeast India tour package : కొండ ప్రాంతాల్లో ప్రకృతి అందాలు చూసేందుకు తహతహలాడుతున్నారా? దీని కోసం ఈశాన్య భారతానికి మించిన టూరిస్ట్​ స్పాట్​ ఏముంటుంది? మీ కోరికలకు తగ్గట్టుగానే.. సరికొత్త టూర్​ ప్యాకేజీతో వచ్చేసింది ఐఆర్​సీటీసీ. ఇది ఎయిర్​ టూర్​ ప్యాకేజీ కావడం విశేషం. బగ్​డోగ్ర, డార్జిలింగ్​, గ్యాంగ్​టక్​, కలింపాంగ్​ ప్రాంతాలను మీరు చుట్టేయవచ్చు. ఈ ఎయిర్​ టూర్​ ప్యాకేజీ.. 5 రాత్రుళ్లు, 6 రోజులు ఉంటుంది.

అక్టోబర్​లో రెండు టూర్స్​ను ఏర్పాటు చేసింది ఐఆర్​సీటీసీ. మొదటిది అక్టోబర్​ 1న ప్రారంభమవుతుంది. రెండోవది.. అక్టోబర్​ 31న మొదలవుతుంది.

IRCTC Northeast air tour package : ఢిల్లీ నుంచి ఈ ఎయిర్​ టూర్​ షురూ అవుతుంది. ఫ్లైట్​ నెం జీ8 153లో ప్రయాణికులు.. బగ్​డోగ్ర విమానాశ్రయానికి వెళతారు. ఎయిర్​ టూర్​లో భాగంగా తొలిరోజు కలింపాంగ్​ను కవర్​ చేస్తారు. హోటల్​ సమిట్​ లిల్లియం అండ్​ స్పా లేదా హోటల్​ గార్డెన్​ రీచ్​లో మీకు స్టే లభిస్తుంది. డిన్నర్​ సదుపాయం కూడా ఉంటుంది.

ఐఆర్​సీటీటీ ఎయిర్​ టూర్​లో రెండో రోజు.. కలింపాంగ్​తో పాటు గ్యాంగ్​టక్​ను సందర్శిస్తారు. డిన్నర్​, బ్రేక్​ఫాస్ట్​ హోటళ్లల్లో లభిస్తుంది. కలింపాంగ్​లో పైన్​ వ్యూ ఫ్లవర్​ నర్సరీ, గోల్ఫ్​ కోర్స్​, డర్బిన్​ ధారా హిల్స్​ని వీక్షిస్తారు. మధ్యాహ్నానికి గ్యాంగ్​టక్​ వెళతారు. హోటల్​ సమిట్​ గోల్డన్​ లేదా హోటల్​ సమిట్​ డెన్​జాంగ్​లో బస చేస్తారు. డిన్నర్​ సదుపాయం కూడా ఉంటుంది.

ఐఆర్​సీటీసీ ఎయిర్​ టూర్​లో మూడో రోజున గ్యాంగ్​టక్​లోని సమ్​గో లేక్​, బాబా హర్భజన్​ మెమోరియల్​ని సందర్శిస్తారు. బ్రేక్​ఫాస్ట్​, డిన్నర్​ ప్యాకేజీలోనే లభిస్తుంది.

IRCTC tourism packages : నాలుగో రోజు.. ఎన్చె మొనాస్ట్రీ, హనుమాన్​ టక్​, గణేశ్​ టక్​, టషి వ్యూ పాయింట్​, ఫ్లవర్​ ఎగ్జిబిషన్​ షో వంటివి వీక్షిస్తారు. ఆ తర్వాత.. డార్జిలింగ్​కి వెళతారు. సమిట్​ గ్రేస్​ హోటల్​ లేదా హోటల్​ సమిట్​ స్విస్​లో బస చేస్తారు.

ఇక ఐఆర్​సీటీసీ ఎయిర్​ టూర్​ ఐదో రోజు భాగంగా.. టైగర్​ హిల్స్​, మౌంట్​ గంచెన్డ్​జొంగపై సూర్యోదయాన్ని వీక్షిస్తారు. ఘూమ్​ మొనాస్ట్రీ, బటాషియా లూప్​ను కవర్​ చేస్తారు. జపనీస్​ టెంపుల్​, పీఎన్​ జూలాజికల్​ పార్క్​, టిబెటిన్​ రెఫ్యూజీ సెల్ఫ్​ హెల్ప్​ సెంటర్​, టెంజింగ్​ రాక్​, టీ గార్డెన్​ను సందర్శిస్తారు.

ఇక ఈ ఎయిర్​ టూర్​లో చివరి రోజున.. డార్జిలింగ్​ నుంచి బాగ్​డోగ్రా విమానాశ్రయానికి వెళతారు. అక్కడి నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరుతారు. అక్కడితో ఐఆర్​సీటీసీ టూర్​ ముగుస్తుంది.

IRCTC latest tour packages in telugu : ఈ ఐఆర్​సీటీసీ టూర్​ ప్యాకేజీలో ఫ్లైట్​ రేట్లు, భోజనం, హోటల్స్​, స్థానిక ప్రయాణాలు, ట్రావేల్​ ఇన్షూరెన్స్​ వంటివి కలుపుకునే ఉంటాయి. ఈ ప్యాకేజీ ధర.. రూ. 39,700 నుంచి ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాల కోసం ఐఆర్​సీటీసీ అధికారిక వెబ్​సైట్​ను చూడాల్సి ఉంటుంది. (https://www.irctctourism.com/pacakage_description?packageCode=NDA23)

తదుపరి వ్యాసం