తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Coast Guard Navik Recruitment: ఇండియన్ నేవీలోని తీర రక్షక దళంలో నావిక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Coast Guard Navik Recruitment: ఇండియన్ నేవీలోని తీర రక్షక దళంలో నావిక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu

05 September 2023, 14:53 IST

    • Coast Guard Navik Recruitment: భారతీయ నౌకాదళానికి చెందిన తీర రక్షక దళంలో నావిక్ (Navik) పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో joinindiancoastguard.cdac.in. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Coast Guard Navik Recruitment: నౌకాదళంలో ఉద్యోగం చేయడం చాలామందికి ఒక కల. ఆ కలను సాకారం చేసుకునే అవకాశాన్ని భారతీయ నౌకాదళం కల్పిస్తోంది. నౌకాదళానికి చెందిన తీర రక్షక దళంలో నావిక్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో joinindiancoastguard.cdac.in. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

వేకెన్సీ వివరాలు..

తీర రక్షక దళంలో మొత్తం 350 నావిక్ పోస్ట్ ల భర్తీకి భారతీయ నౌకాదళం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ఆన్ లైన్ లో joinindiancoastguard.cdac.in. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీల్లో..

  • నావిక్ (జనరల్ డ్యూటీ) - 260 పోస్ట్ లు
  • నావిక్ (డొమెస్టిక బ్రాంచ్) - 30 పోస్ట్ లు
  • యాంత్రిక్ (మెకానికల్) - 25 పోస్ట్ లు
  • యాంత్రిక్ (ఎలక్ట్రికల్) - 20 పోస్ట్ లు
  • యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్) - 15 పోస్ట్ లు

అర్హత వివరాలు..

ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే, అభ్యర్థులు మే 1, 2002, ఏప్రిల్ 30, 2006 జన్మించి ఉండాలి. విద్యార్హతలు, ఇతర వివరాలకు అభ్యర్థులు వెబ్ సైట్ లోని డిటైల్డ్ నోటిఫికేషన్ ను పరిశీలించండి. శరీర దారుఢ్య పరీక్షలు సహా మొత్తం నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వీటిలో ఉత్తీర్ణులైనవారికి ఉద్యోగావకాశం కల్పిస్తారు. అభ్యర్థులు రూ. 300 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ లకు ఈ అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

తదుపరి వ్యాసం