Indian Coast Guard Recruitment 2023: నావిక్ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం: వివరాలివే-indian coast guard recruitment 2023 registration process starts for 255 navik posts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Indian Coast Guard Recruitment 2023 Registration Process Starts For 255 Navik Posts

Indian Coast Guard Recruitment 2023: నావిక్ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 07, 2023 12:24 PM IST

Indian Coast Guard Recruitment 2023: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 255 నావిక్ పోస్టులకు దరఖాస్తులు మొదలయ్యాయి. అప్లికేషన్ ప్రాసెస్, విద్యార్హత సహా మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.

Indian Coast Guard Recruitment 2023: నావిక్ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం (Photo: Indian Coast Guard)
Indian Coast Guard Recruitment 2023: నావిక్ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం (Photo: Indian Coast Guard)

Indian Coast Guard Recruitment 2023: నావిక్ ఉద్యోగాలకు (Navik Posts) దరఖాస్తుల ప్రక్రియను ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రారంభించింది. 255 నావిక్ పోస్టుల ఖాళీలకు (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్) ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది కోస్ట్ గార్డ్ (ICG Recruitment 2023). రాత, ఫిజికల్ ఫిట్‍నెస్ టెస్టు, వైద్య పరీక్షల ద్వారా రిక్రూట్‍మెంట్ ఉంటుంది. కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్‍సైట్ (joinindiancoastguard.cdac.in)లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

ICG Recruitment 2023: ఖాళీల వివరాలు, ఆఖరు తేదీ

255 నావిక్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 225 జనరల్ డ్యూటీ, 30 నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఈనెల (ఫిబ్రవరి) 16వ తేదీ సాయంత్రం దరఖాస్తులకు చివరి తేదీగా ఉంది. ఆలోగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలోగా అప్లికేషన్ సమర్పించాలి.

ICG Recruitment 2023: విద్యార్హత

నావిక్ జనరల్ డ్యూటీ పోస్టులకు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో కూడిన కోర్సులో ఇంటర్‌లో పాసై ఉండాలి. డొమెస్టిక్ బ్రాంచ్‍‍కు అప్లై చేసే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ICG Recruitment 2023: వయోపరిమితి

నావిక్ జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 18 నుంచి 22 సంవత్సరాల లోపు ఉండాలి. 2001 సెప్టెంబర్ 1 నుంచి 2005 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు వర్తిస్తుంది. ఓబీసీలకు మూడేళ్లు ఉంటుంది. కొన్ని కేటగిరీలకు నిబంధనలను బట్టి మినహాయింపు ఉంది.

ICG Recruitment 2023: దరఖాస్తు ఫీజు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ICG Recruitment 2023: ఎంపిక ప్రక్రియ

ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఆన్‍లైన్ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‍నెస్ టెస్టుకు ఎంపికవుతారు. దీంట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చివరగా మెరిట్ లిస్ట్ ఉంటుంది. దీంట్లో తుది ఎంపిక జరుగుతుంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వస్తుంది.

ICG Recruitment 2023: అప్లై చేసుకోవడం ఇలా..

  • ముందుగా ఇండియన్ కోస్ట్ గార్డ్ అఫీషియల్ వెబ్‍సైట్ joinindiancoastguard.cdac.in లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో ఉండే Join as Enrolled Personnel (CGEPT) ట్యాబ్‍పై క్లిక్ చేయాలి.
  • అక్కడ రిజిస్ట్రేషన్ లింక్ కనిపిస్తుంది.
  • అనంతరం రిజిస్టర్ అయ్యాక లాగిన్ అవ్వాలి.
  • దరఖాస్తు ఫామ్‍లో అవసరమైన వివరాలు నమోదు చేయాలి. డాక్యుమెంట్లు అప్‍లోడ్ చేయాలి.
  • అనంతరం అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • చివరగా సబ్మిట్‍పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత దరఖాస్తు పూర్తయినట్టు ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

నోటిఫికేషన్ లింక్

IPL_Entry_Point