తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Shyam Saran Negi : స్వతంత్ర భారత దేశ తొలి ఓటర్​ ‘శ్యామ్​’ కన్నుమూత

Shyam Saran Negi : స్వతంత్ర భారత దేశ తొలి ఓటర్​ ‘శ్యామ్​’ కన్నుమూత

05 November 2022, 8:49 IST

    • Shyam Saran Negi death : 106ఏళ్ల హిమాచల్​ ప్రదేశ్​వాసి శ్యామ్​ శరణ్​ నేగి శనివారం తుదిశ్వాస విడిచారు. స్వతంత్ర భారత దేశ తొలి ఓటర్​గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.
శ్యామ్​ శరణ్​ నేగి
శ్యామ్​ శరణ్​ నేగి (HT/file)

శ్యామ్​ శరణ్​ నేగి

Shyam Saran Negi death: స్వతంత్ర భారత దేశ తొలి ఓటర్​గా గుర్తింపు తెచ్చుకున్న హిమాచల్​ ప్రదేశ్​ వాసి శ్యామ్​ శరణ్​ నేగి కన్నుమూశారు. 106ఏళ్ల నేగి.. అనారోగ్య కారణాలతో కిన్నౌర్​లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

ట్రెండింగ్ వార్తలు

Porsche accident : ‘వ్యాసాలు రాయి..’ పోర్షేతో ఇద్దరిని చంపిన మైనర్​కి 15 గంటల్లోనే బెయిల్​!

Iran President : హెలికాప్టర్​లో ప్రయాణం.. ఆరోగ్యానికి హానికరం! నాడు సంజయ్​ గాంధీ- నేడు రైసీ..

Iran President Raisi death : హెలికాప్టర్​ ప్రమాదంలో ఇరాన్​ అధ్యక్షుడు రైసీ మృతి

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

హిమాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 2న.. పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు శ్యామ్​ శరణ్​ నేగి. అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించిందని తెలిస్తోంది. 

శ్యామ్​ శరణ్​ నేగి అంత్యక్రియల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్​ అబిద్​ హుస్సేన్​ ఓ ప్రకటనలో తెలిపారు.

తొలి ఓటర్​..

Independent India's first voter : 1917 జులై 1న జన్మించిన నేగి.. కల్పాలో స్కూల్​ టీచర్​గా పనిచేశారు. 1947లో బ్రిటీష్​ రాజ్యానికి ముగింపు పడిన కొన్నేళ్లకు దేశంలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఈ విధంగా.. 1951 అక్టోబర్​ 25న ఓటు వేసి, స్వతంత్ర భారత దేశ తొలి ఓటర్​గా చరిత్రకెక్కారు శ్యామ్​ శరణ్​ నేగి.

వాస్తవానికి దేశంలో 1952 ఫిబ్రవరిలో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. కానీ హిమాచల్​ ప్రదేశ్​లో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, కొన్ని నెలల ముందే.. అంటే అక్టోబర్​లోనే పోలింగ్​ నిర్వహించారు.

అప్పటి నుంచి ఒక్క ఎన్నికను కూడా మిస్​ అవ్వకుండా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు నేగి. 2014లో ఆయన్ని ఎలక్షన్​ ఐకాన్​గా నిలబెట్టారు. ప్రజలందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రచారాలు చేసి పిలుపునిచ్చేవారు.

Shyam Saran Negi : "ఓటు వేయడం అనేది తమ బాధ్యత అని యువ ఓటర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇది దేశాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. దేశాన్ని సమర్థంగా నడిపించగలిగే నాయకుడిని ఎన్నుకునే శక్తి మన వద్ద ఉంది అంటే.. చాలా గర్వపడాల్సిన విషయం," అని ఓ సందర్భంలో నేగి అన్నారు.

హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికలు..

హిమాచల్​ ప్రదేశ్​లో ఈ నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ నెల 1 నుంచి 11 వరకు పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా పోలింగ్​ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 2వ తేదీన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు శ్యామ్​ శరణ్​ నేగి.

Himachal Pradesh assembly elections 2022 : నేగి ఇంటి కాంపౌండ్​లో ఎన్నికల అధికారులు ఓ పోస్టల్​ బూత్​ను ఏర్పాటు చేశారు. రెడ్​ కార్పెట్​ వేసి.. నేగిని స్వాగతించారు. నేగి వేసిన ఓటును ఎన్​వొలప్​లో పెట్టి సీల్​ చేశారు. బ్యాలెట్​ బాక్స్​లో వేశారు.

ఈ వార్త విన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. స్వతంత్ర భారత దేశ తొలి ఓటర్​ శ్యామ్​ శరణ్​ నేగిపై ప్రశంసల వర్షం కురిపించారు.

'సనమ్​ రే' అనే బాలీవుడ్​ సినిమాలో స్పెషల్​ అపియరెన్స్​ కూడా ఇచ్చారు శ్యామ్​ శరణ్​ నేగి.

తదుపరి వ్యాసం