తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : బాలికను చంపి.. మృతదేహంతో సెక్స్​ చేసిన ముగ్గురు అరెస్ట్​!

Crime news : బాలికను చంపి.. మృతదేహంతో సెక్స్​ చేసిన ముగ్గురు అరెస్ట్​!

Sharath Chitturi HT Telugu

29 September 2023, 6:43 IST

  • Crime news : అసోంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికను ఓ వ్యక్తి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం.. ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె మృతదేహంతో సెక్స్​ చేశాడు!

బాలికను చంపి.. మృతదేహంతో సెక్స్​ చేసిన ముగ్గురు అరెస్ట్​!
బాలికను చంపి.. మృతదేహంతో సెక్స్​ చేసిన ముగ్గురు అరెస్ట్​!

బాలికను చంపి.. మృతదేహంతో సెక్స్​ చేసిన ముగ్గురు అరెస్ట్​!

Assam Crime news : అసోంలో ఇటీవలే కలకలం సృష్టించిన ఓ బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్​ చేశారు. బాలికను చంపిన నిందితులు.. మృతదేహంతో సెక్స్​ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

ఇదీ జరిగింది..

అసోంలోని కరీమ్​గంజ్​ పట్టణంలో జరిగింది ఈ ఘటన. బాధిత మైనర్​.. కొన్ని రోజుల క్రితం అదృశ్యమైంది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. కరీమ్​గంజ్​ బైపాస్​ దగ్గర ఈ నెల 9న ఓ మృతదేహం లభించింది. ఆ మృతదేహం తమ బిడ్డదేనని బాధిత బాలిక తల్లిదండ్రులు ధ్రువీకరించారు.

Necrophilia case in Assam : మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అప్పుడే ఒక షాకింగ్​ విషయం తెలిసింది. ఇదొక నెక్రోఫీలియా కేసు అని పోస్టుమార్టం నివేదికలో తేలింది. నెక్రోఫీలియా అంటే.. తొలుత చంపి, ఆ తర్వాత మృతదేహంతో సెక్స్​ చేయడం! ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ క్రమంలోనే పోలీసులకు కొన్ని రోజుల క్రితం ఓ క్లూ దొరికింది. బాలిక వ్యక్తిగత డైరీలో ఓ ఫోన్​ నెంబర్​ లభించింది. అందులో ఓ ఫోన్​ నెంబర్​ కనిపించింది. అది ఓ రైల్వే ఉద్యోగి నెంబర్​ అని తెలిసింది. ఆ వ్యక్తి- బాలిక రిలేషన్​లో ఉన్నట్టు తెలుసుకున్నారు.

ఇదీ చూడండి:- Minor raped in MP: చిన్నారిపై అత్యాచారం; రక్తమోడుతున్నా స్పందించని జనం

Girl killed and raped in Assam : "రైల్వే ఉద్యోగంలో కొత్తగా చేరిన ఓ వ్యక్తితో బాలిక రిలేషన్​లో ఉంది. భౌతికంగా కలవాలని అతను ఫోర్స్​ చేసేవాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. చాలాసార్లు రిజెక్ట్​ చేసింది. ఈ నెల 9న.. ఆ మైనర్​ ఒంటరిగా ఇంట్లో ఉందని ఆ వ్యక్తి తెలుసుకున్నాడు. మరో ఇద్దరితో కలిసి అక్కడికి వెళ్లాడు. సెక్స్​ గురించి అడిగాడు. ఆమె మళ్లీ ఒప్పుకోలేదు. కోపంతో ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత.. ముగ్గురు కలిసి, ఆమె మృతదేహంతో సెక్స్​ చేశారు!" అని పోలీసులు వెల్లడించారు.

మృతదేహంతో సెక్స్​ చేసిన తర్వాత.. దానిని బైపాస్​కు సమీపంలో పడేసిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.

Necrophilia cases in India : ప్రస్తుతం.. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికుల నుంచి డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి.

తదుపరి వ్యాసం