Whatsapp tricks : వాట్సాప్ స్టేటస్‌లను సీక్రెట్‌గా చూసేయొచ్చు ఇలా!
16 August 2022, 23:55 IST
- Whatsapp tricks : స్టేటస్ ఫీచర్‌ను వాట్సాప్ దాదాపు మూడేళ్ల క్రితం ప్రారంభించింది. ఆ ఫీచర్ వెంటన్ ఇన్‌స్టంట్ సక్సెస్‌గా నిలిచింది. తమ ఫొటోలు, లేదా నచ్చిన కోట్స్‌ను స్టేటస్‌గా పెట్టుకోవడం వాట్సాప్ యూజర్లకు కామన్‌గా మారింది.
వాట్సాప్
Whatsapp tricks : మనం మన ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నవారి స్టేటస్‌ను చూస్తే.. మనం వారి స్టేటస్ మెసేజ్‌ను చూసినట్లు వారికి వెంటనే తెలిసిపోతుంది. వ్యూయర్స్ లిస్ట్‌లో మన పేరు చేరిపోతుంది. అలా కాకుండా, `స్టేటస్‌లను చూడాలి.. కానీ వాళ్లకు తెలియకూడదు` అనుకునే సీక్రెట్ యూజర్ల కోసమే ఈ టిప్స్..
Whatsapp tricks : సీక్రెట్‌గా చూసేయొచ్చు
ఈ టిప్స్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు కూడా వాడుకోవచ్చు. సెట్టింగ్స్‌లో రీడ్ రిసీట్స్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. లేదా ఆఫ్‌లైన్‌లో ఉండి, ఆ స్టేటస్‌లను చూడడం ద్వారా కూడా అది సాధ్యమవుతుంది. సాధారణంగా సెట్టింగ్స్‌లో `రీడ్ రిసీట్స్` ఆప్షన్‌ను డిసేబుల్ చేయడం ద్వారా ఇతరులు మనకు పంపిన మెసేజెస్‌ను మనం చూసిన విషయం తెలియకుండా ఉంటుంది. అంటే `రీడ్ రిసీట్స్` ఆప్షన్‌ను డిసేబుల్ చేస్తే మెసేజ్‌లపై `బ్లూ టికింగ్` ఉండదు. స్టేటస్ లకు కూడా ఇది వర్తిస్తుంది.
Whatsapp tricks : ఇలా చేయండి..
వాట్సాప్‌లో `రీడ్ రిసీట్స్` ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోవడం చాలా తేలిక. ఇందుకు ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు..
- ముందుగా వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాలి
- కుడివైపు పైన ఉన్న మూడు డాట్స్‌ను టచ్ చేయడం ద్వారా మెనును ఓపెన్ చేయాలి
- చివరన ఉన్న సెట్టింగ్స్‌ను ట్యాప్ చేయాలి
- ప్రైవసీ ఆప్షన్‌ను ట్యాప్ చేస్తే.. రీడ్ రిసీట్స్ ఆప్షన్ కనిపిస్తుంది
- రీడ్ రిసీట్స్‌ను డిసేబుల్ చేయాలి.
Whatsapp tricks : ఆఫ్‌లైన్‌లో చూడడం ఎలా?
స్టేటస్‌ను చూసే ముందు మొబైల్ డేటా లేదా వైఫైను ఆఫ్ చేయాలి. లేదా వాట్సాప్‌ను బ్రౌజర్ ద్వారా ఇన్‌కాగ్నిటో మోడ్‌లో చూడాలి. ఇలా చూడడం వల్ల కూడా వారి స్టేటస్ వ్యూయర్స్ లిస్ట్ లో చేరకుండా ఉండొచ్చు. కానీ, ఈ పద్ధతితో సమస్య ఏంటంటే, ఒకసారి మళ్లీ మొబైల్ డేటా లేదా వైఫై ఆన్ చేయగానే మీరు వారి స్టేటస్ చూసిన విషయం వారికి తెలిసిపోతుంది. అందువల్ల, ఈ పద్ధతిలో ఇతరుల వాట్సాప్ మెసేజెస్‌ను చూడాలనుకునేవారు వారి వాట్సాప్ స్టేటస్ ఎక్స్‌పైర్ కావడానికి కొద్ది క్షణాల ముందు చూస్తే, మీరు ఆన్‌లైన్‌లోకి వచ్చే సమయానికి వారి స్టేటస్ ఎక్స్‌పైర్ అయిపోతుంది. మీరు సేఫ్ అయిపోతారు. సాధారణంగా వాట్సాప్ మెసేజెస్ 24 గంటల్లో ఎక్స్‌పైర్ అయిపోతాయన్న విషయం తెలిసిందే. మరో ట్రిక్ ఏంటంటే, ఆఫ్‌లైన్‌లో స్టేటస్ చూడగానే `ఫోర్స్ స్టాప్ వాట్సాప్`ను ఉపయోగించడం ద్వారా కూడా మనం సీక్రసీ మెయింటైన్ చేయొచ్చు.
Whatsapp tricks : ఫైల్ మేనేజర్ ద్వారా..
ఆండ్రాయిడ్ ఫోన్లలోని ఫైల్ మేనేజర్ లో ఉన్న వాట్సాప్ స్టేటస్ ఫోల్డర్ ద్వారా కూడా సీక్రెట్‌గా మన కాంటాక్ట్స్‌లోని వారి స్టేటస్‌లు చూడొచ్చు. సాధారణంగా ఆండ్రాయిడ్ యూజర్లు స్టేటస్ ట్యాబ్‌ను ఓపెన్ చేయగానే, అన్నిస్టేటస్ ఇమేజెస్‌ను ఫోన్ స్టోరేజ్‌లోకి వాట్సాప్ డౌన్‌లోడ్ చేస్తుంది. అలా ఫోన్ స్టోరేజ్‌లో సేవ్ అయిన స్టేటస్‌లను ఈ స్టెప్స్ ద్వారా చూడొచ్చు.
- ఫైల్ మేనేజర్ లోకి వెళ్లాలి
- ఇంటర్నల్ స్టోరేజ్‌లోకి వెళ్లి అక్కడి వాట్సాప్ ను ట్యాప్ చేయాలి.
- అనంతరం మీడియా ఫోల్డర్ లోకి వెళ్లి, అందులోని స్టేటసెస్ ఫోల్డర్ ఓపెన్ చేయాలి.
- కాంటాక్ట్స్ లిస్ట్‌లోని వారు షేర్ చేసిన అన్ని స్టేటస్ ఇమేజెస్ అందులో ఉంటాయి.
- ఒకవేళ స్టేటస్ ఫోల్డర్ కనిపించకపోతే.. ఫైల్ మేనేజర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, షో హిడెన్ ఫైల్స్(Show hidden files)ను ఇనేబుల్ చేయాలి.