తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chandigarh Accident: షాకింగ్ వీడియో: వీధి కుక్కకు ఆహారం తినిపిస్తున్న యువతిని ఢీకొట్టిన కారు

Chandigarh Accident: షాకింగ్ వీడియో: వీధి కుక్కకు ఆహారం తినిపిస్తున్న యువతిని ఢీకొట్టిన కారు

16 January 2023, 19:09 IST

    • Hit and Run case in Chandigarh: వీధి శునకానికి (కుక్క) ఆహారం తినిపిస్తున్న ఓ యువతిని వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ కూడా బయటికి వచ్చింది.
Chandigarh Accident: వీధి కుక్కకు ఆహారం తినిపిస్తున్న యువతిని ఢీకొట్టిన కారు
Chandigarh Accident: వీధి కుక్కకు ఆహారం తినిపిస్తున్న యువతిని ఢీకొట్టిన కారు (HT Photo)

Chandigarh Accident: వీధి కుక్కకు ఆహారం తినిపిస్తున్న యువతిని ఢీకొట్టిన కారు

Hit and Run in Chandigarh: వీధి శునకానికి ఆహారం తినిపిస్తున్న ఓ యువతిని ఓ కారు ఢీకొట్టింది. ఇంటి సమీపంలో రహదారి సైడ్‍లో ఉన్న ఆ అమ్మాయిని వేగంగా వచ్చిన కారు ఢీకొని వెళ్లిపోయింది. చండీగఢ్‍లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన సీసీటీటీ ఫుటేజ్ బయటికి వచ్చింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే..

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

తీవ్ర గాయాలు

Hit and Run in Chandigarh: చండీగఢ్‍ సెక్టార్ 53లో జరిగిన ఈ ఘటనలో 25 ఏళ్ల తేజస్విత తీవ్రంగా గాయపడ్డారు. ఆమె తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం సెక్టార్ 16లోని ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. తేజస్విత తన ఇంటి సమీపంలో ఆమె తల్లి మన్‍జీందర్ కౌర్‌తో కలిసి రోడ్డు పక్కన వీధి శునకాలకు ఆహారం తినిపిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఇదీ జరిగింది

Chandigarh Accident: శనివారం జరిగిన ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజీ తాజాగా బయటికి వచ్చింది. ప్రమాదం ఎలా జరిగిందో దీంట్లో తెలుస్తోంది. తేజస్విత.. ఓ శునకానికి ఆహారం తినిపిస్తోంది. ఆ సమయంలో మహీంద్రా థార్ ఎస్‍యూవీ వేగంగా యూటర్న్ తీసుకొని.. తేజస్వితను ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ కారు ఆగకుండానే వెళ్లిపోయింది.

Chandigarh Accident: రక్తపు మడుగులో ఉన్న తేజస్వితను చూసిన ఆమె తల్లి సాయం కోసం అరిచారు. అయితే ఢీకొట్టిన ఆ కారు కూడా ఆపకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత చాలా వాహనాలు కూడా నిలుపలేదని ఆమె తెలిపారు. అనంతరం ఆమె పోలీస్ కంట్రోల్ రూమ్‍కు కాల్ చేశారు.

తేజస్విత.. ఆర్టికల్చర్‌లో డిగ్రీ పూర్తి చేశారని, ప్రస్తుతం సివిల్ సర్వీస్ ఎంట్రన్స్ పరీక్షకు సిద్ధమవుతోందని ఆమె తండ్రి ఒజాస్వి కౌశల్ చెప్పారు. తేజస్విత ప్రతీరోజు వీధి శునకాలను ఆహారం తినిపిస్తుందని ఆయన చెప్పారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ వాహనం, డ్రైవర్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈనెలలోనే ఢిల్లీలో ఓ భయానక ఘటన జరిగింది. 20 ఏళ్ల ఓ యువతిని ఓ కారు 12 కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ ఘటన దేశరాజధానిని కుదిపేసింది. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తదుపరి వ్యాసం