తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sundar Pichai Padma Bhushan : 'పద్మ భూషణ్​' అందుకున్న సుందర్​ పిచాయ్​

Sundar Pichai Padma Bhushan : 'పద్మ భూషణ్​' అందుకున్న సుందర్​ పిచాయ్​

03 December 2022, 8:32 IST

    • Sundar Pichai Padma Bhushan : గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​.. పద్మ భూషణ్​ అవార్డును అందుకున్నారు. అమెరికా శాన్ ​ఫ్రాన్సిస్కోలో ఈ ఈవెంట్​ జరిగింది.
అమెరికాలోని భారత రాయబారి తరన్​జిత్​తో సుందర్​ పిచాయ్​
అమెరికాలోని భారత రాయబారి తరన్​జిత్​తో సుందర్​ పిచాయ్​

అమెరికాలోని భారత రాయబారి తరన్​జిత్​తో సుందర్​ పిచాయ్​

Sundar Pichai honoured with Padma Bhushan : గూగుల్- అల్ఫాబెట్​​ సీఈఓ, భారత సంతతి సుందర్​ పిచాయ్​.. పద్మ భూషణ్​ అవార్డును అందుకున్నారు. భారత దేశ మూడో అత్యున్నత పౌర పురస్కరమైన పద్మ భూషణ్​ను సుందర్​ పిచాయ్​కు బహుకరించారు అమెరికాలోని భారత రాయబారి తరన్​జిత్​ సింగ్​ సంధు.

ఏ ఏడాది తొలినాళ్లల్లో.. భారత ప్రభుత్వం.. ట్రేడ్​ అండ్​ ఇండస్ట్రీ విభాగంలో సుందర్​ పిచాయ్​ను పద్మ భూషణ్​ అవార్డుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. శాన్​ ఫ్రాన్సిస్కోలో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ అవార్డును అందుకున్నారు గూగుల్​ సీఈఓ.

Google CEO Sundar Pichai : "నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన భారత ప్రభుత్వానికి, భారతీయులకు నా ధన్యవాదాలు. నన్ను ఈస్థాయికి తీర్చిదిద్దిన దేశం నుంచి ఇంతటి ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకోవడం చాలా అర్థవంతంగా అనిపిస్తోంది. ఇండియా.. నాలో భాగం. ఇండియా చెప్పిన విలువలను నేను ఎక్కడికి వెళితే అక్కడి తీసుకెళతాను. ఈ అవార్డు మాత్రం భద్రంగా దాచుకుంటాను. జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం నిరంతరం కృషిచేసే కుటుంబంలో నేను పుట్టడం చాలా అదృష్టం. నేను నా ఆసక్తులు, ఇష్టాలను వెతుక్కుంటూ వెళ్లడంతో నా తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేశారు. వారికి నా ధన్యవాదాలు," అంటూ భావోద్వేగానికి లోనయ్యారు సుందర్​ పిచాయ్​.

ఇండియాలో టెక్నాలజీ వేగంగా వృద్ధి చెందుతోందని, ఈ పరిణామాలు చాలా సంతోషకరం అని సుందర్​ పిచాయ్​ అన్నారు. ఇలాంటి భారత దేశానికి ఎప్పుడు వెళ్లినా అద్భుతంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇండియా నుంచి వచ్చే ఆవిష్కరణలతో ప్రపంచం లబ్ధిపొందుతోందని అభిప్రాయపడ్డారు.

Sundar Pichai India : "గూగుల్​, ఇండియాతో భాగస్వామ్యాన్ని కొనసాగించాలని నేను భావిస్తున్నాను. ఈ రెండూ కలిస్తే.. ప్రజలకు టెక్నాలజీ రూపంలో మంచి జరుగుతుంది," అని గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం