తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Republic Day Chief Guests: మన రిపబ్లిక్ డే ఉత్సవాలకు గతంలో చీఫ్ గెస్ట్ లుగా వచ్చిన దేశాధినేతలు వీరే..

Republic Day chief guests: మన రిపబ్లిక్ డే ఉత్సవాలకు గతంలో చీఫ్ గెస్ట్ లుగా వచ్చిన దేశాధినేతలు వీరే..

HT Telugu Desk HT Telugu

25 January 2024, 15:18 IST

    • Republic Day chief guests: ప్రతీ సంవత్సరం మన గణతంత్ర వేడుకలకు మిత్ర దేశాల అధినేతలను ముఖ్య అతిథులుగా పిలవడం ఆవాయితీగా వస్తోంది. ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో జరిగే 75వ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
గతంలో రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా వచ్చిన నెల్సన్ మండేలా, వ్లాదిమిర్ పుతిన్
గతంలో రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా వచ్చిన నెల్సన్ మండేలా, వ్లాదిమిర్ పుతిన్ (X and HT archive)

గతంలో రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా వచ్చిన నెల్సన్ మండేలా, వ్లాదిమిర్ పుతిన్

భారతదేశం తన 75 వ గణతంత్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకోనుంది. ఈ వేడుకల్లో భారతదేశ ఘన సంప్రదాయం, సాంస్కృతిక వారసత్వం, దేశ పురోగతి మరియు విజయాలను చూపించే శకటాలను ప్రదర్శిస్తారు. రిపబ్లికే డే సందర్భంగా జరిగే పరేడ్ కు ఢిల్లీలో, వివిధ రాష్ట్రాల రాజధానుల్లో రిహార్సల్స్ కొనసాగుతున్నాయి.

1950 జనవరి 26న..

1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని (constitution) ఆమోదించిన సందర్భంగా, ప్రతీ సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. భారతదేశం 1947 లో బ్రిటన్ నుండి స్వాతంత్య్రం సాధించింది. అయినా, 1950 జనవరి 26 వరకు భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు. 1950, జనవరి 26వ తేదీన భారత దేశం అధికారికంగా సార్వభౌమ, గణతంత్ర రాజ్యంగా మారింది.

ఫ్రాన్స్ అధ్యక్షుడు

ప్రతీ సంవత్సరం మన గణతంత్ర వేడుకలకు (Republic Day) మిత్ర దేశాల అధినేతలను అతిథులుగా పిలవడం ఆవాయితీగా వస్తోంది. అలాగే, ఈ సంవత్సరం జనవరి 26 న ఢిల్లీలో జరిగే 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 2021, 2022 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులను ఆహ్వానించలేదు.

గత రిపబ్లిక్ డే లకు వచ్చిన ముఖ్య అతిథులు

2023: ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి.

2020: జైర్ బోల్సొనారో, బ్రెజిల్ అధ్యక్షుడు

2019: సిరిల్ రామఫోసా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు

2018: ఆసియాన్ (Association of Southeast Asian Nations ASEAN) దేశాల అధినేతలు.

2017: మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుదాబి యువరాజు.

2016: ఫ్రాంకోయిస్ హోలాండే, ఫ్రాన్స్ అధ్యక్షుడు.

2015: బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్షుడు.

2014: షింజో అబే, జపాన్ ప్రధాని

2013: జిగ్మే ఖేసర్ నామ్ గ్యెల్ వాంగ్ చుక్, భూటాన్ రాజు

2012: యింగ్లక్ షినావత్రా, థాయ్ లాండ్ ప్రధాని

గతంలో వచ్చిన మరికొందరు ప్రముఖులు

1957: జార్జి జుకోవ్, రక్షణ మంత్రి, సోవియట్ యూనియన్

1960: క్లిమెంట్ వోరోషిలోవ్, సోవియట్

యూనియన్ ప్రెసిడెంట్

1961: క్వీన్ ఎలిజబెత్, యూకే

1967: రాజు మహమ్మద్ జహీర్ షా, ఆఫ్ఘనిస్తాన్

1971: జూలియస్ నైరెర్, టాంజానియా అధ్యక్షుడు

1995: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు

2002: కాసామ్ ఉటీమ్, మారిషస్ అధ్యక్షుడు

2007: వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు

తదుపరి వ్యాసం