Preamble to the Constitution: ‘ఇక విద్యాసంస్థల్లో రాజ్యాంగ పీఠికను రోజూ చదవాల్సిందే..’
Preamble to the Constitution: కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంపై పిల్లలకు అవగాహన కల్పించే లక్ష్యంతో.. ఇకపై అన్ని విద్యాసంస్థల్లో ప్రతీ రోజు ఉదయం ప్రార్థన సమయంలో రాజ్యాంగ పీఠికను పఠించాలని ఆదేశాలు జారీ చేసింది.
Preamble to the Constitution: కర్నాటకలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఇకపై ప్రతీ రోజు ఉదయం ప్రార్థన సమయంలో రాజ్యాంగ పీఠిక (Preamble to the Constitution) ను పఠించాల్సిందే. ఈ మేరకు కర్నాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పీఠికను పఠించడంతో పాటు రాజ్యాంగ విలువలను కాపాడుతానని, రాజ్యాంగ విలువలను తమ జీవితంలో భాగం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధాన సౌధ సమీపంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో రాజ్యాంగ పీఠికను పఠించారు. ఈ సందర్భంగా సీఎం సిద్ధ రామయ్య మాట్లాడుతూ.. ఇకనుంచి రాష్ట్రంలోని ప్రతీ విద్యా సంస్థలో ప్రతీ రోజు రాజ్యాంగ పీఠికను చదవాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు పరమేశ్వరన్, రామలింగారెడ్డి, కేజే జార్జ్ తదితరులు హాజరయ్యారు.
రాజ్యాంగంపై అవగాహన
రాజ్యాంగం, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు.. మొదలైన వాటిపై అందరికీ కనీస అవగాహన ఉండాలని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. అప్పుడే ప్రజాస్వామ్యంపై జరిగే దాడులను అడ్డుకోవచ్చన్నారు.
టాపిక్