తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Conman Sukesh Alleges About Aap Corruption: ‘ఆ నాయకుడికి రూ. 10 కోట్లు ఇచ్చా’

Conman Sukesh alleges about AAP Corruption: ‘ఆ నాయకుడికి రూ. 10 కోట్లు ఇచ్చా’

HT Telugu Desk HT Telugu

01 November 2022, 16:14 IST

  • Conman Sukesh alleges about AAP Corruption: అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ ఆరోపణలపై జైళ్లో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీ ఎల్జీ సక్సేనాకు రాసిన లేఖలో సంచలన వాస్తవాలను వెల్లడించాడు.

 సుకేశ్ చంద్రశేఖర్
సుకేశ్ చంద్రశేఖర్

సుకేశ్ చంద్రశేఖర్

Conman Sukesh alleges about AAP Corruption: బెదిరింపు వసూళ్లతో కోట్లు గడించిన సుకేశ్ తాజాగా జైలు నుంచి ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనాకు లేఖ రాశారు. ఆప్ నేత సత్యేంద్ర జైన్ సహా ఆప్ నాయకులకు కోట్లలో డబ్బు ఇచ్చానని ఆ లేఖలో వెల్లడించాడు.

Conman Sukesh alleges about AAP Corruption: 2015 నుంచి తెలుసు..

ఆప్ నేత సత్యేంద్ర జైన్(Satyendra Jain) తనకు 2015 నుంచి తెలుసని సుకేశ్ తెలిపాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 50 కోట్లకు పైగా ఇచ్చానన్నారు. తనకు సౌత్ జోన్ లో పార్టీలో మంచి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, రాజ్యసభ సభ్యత్వం కూడా ఇస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. అయతే, ఈ ఆరోపణలను ఆప్ ఖండించింది. అవన్నీ అబద్ధాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. గుజరాత్ లో మొర్బి బ్రిడ్జ్ కూలి 140 మందికి పైగా చనిపోయిన ఘటనలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ అబద్ధపు వార్తను ప్రచారంలోకి తెచ్చారని ఆరోపించారు.

Conman Sukesh alleges about AAP Corruption: 2017లో అరెస్ట్

తమిళనాడులో శశికళ, జయలలితలకు సంబంధించిన అక్రమాస్తుల కేసుల్లో సుకేశ్ 2017లొ అరెస్టయ్యాడు. ఆ సమయంలో తమిళనాడులో శశికళకు సంబంధించిన అన్నాడీఎంకే వర్గంలో ఆయన ఉన్నాడు. ఆ సమయంలో ఢిల్లీలో జైళ్ల శాఖ మంత్రిగా సత్యేంద్ర జైన్(Satyendra Jain) ఉన్నాడు. జైళ్లో ఉన్న సమయంలో తనను సత్యేంద్ర జైన్ పలుమార్లు కలిశాడని ఎల్జీకి రాసిన లేఖలో Sukesh Chandrashekhar వెల్లడించారు. ‘నేను జైళ్లో ప్రాణాలతో ఉండాలంటే, నాకు జైళ్లో కనీస సదుపాయాలు లభించాలంటే ప్రొటెక్షన్ మనీ(protection money) కింద నెలకు రూ. 2 కోట్లు ఇవ్వాలని జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయెల్ కు రూ. 1.5 కోట్లు ఇవ్వాలని సత్యేంద్ర జైన్ డిమాండ్ చేశాడు. ఆ విధంగా జైన్ కు రూ. 10 కోట్లు, సందీప్ గోయెల్ కు రూ. 12.50 కోట్లు ఇచ్చాను‘ అని సుకేశ్ ఆ లేఖలో ఆరోపించాడు.

Conman Sukesh alleges about AAP Corruption: సాక్ష్యాలున్నాయి

తన ఆరోపణలకు సంబంధించి తన వద్ద అన్ని సాక్ష్యాధారాలున్నాయని, వాటిని కోర్టుకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానని సుకేశ్ ఆ లేఖలో వెల్లడించారు. నీతిమంతమైన పార్టీ అని చెప్పుకునే ఆప్ అసలు స్వరూపం బయటపడాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈడీ, సీబీఐ లకు ఇందుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే అందించానన్నారు. కాగా, ఈ సుకేశ్ చంద్ర శేఖర్ నుంచి ఖరీదైన బహుమతులు తీసుకున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం