తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ex-boyfriend Murdered Teen: పెళ్లికి నిరాకరించిందని యువతి హత్య

Ex-boyfriend murdered teen: పెళ్లికి నిరాకరించిందని యువతి హత్య

HT Telugu Desk HT Telugu

26 April 2023, 21:48 IST

  • Ex-boyfriend murdered teen: యమునా నగర్ లో లభించిన యువతి మృతదేహం సంచలనం సృష్టించింది. పోలీసులు దర్యాప్తు జరిపి, ఆ యువతి స్నేహితుడే ఆమెను హత్య చేశాడని నిర్ధారించారు. తనను పెళ్లి చేసుకోవడానికి ఆమె నిరాకరించడంతో ఆమెను హత్య చేశాడని తెలిపారు. 

నిందితుడితో యమున నగర్ పోలీసులు
నిందితుడితో యమున నగర్ పోలీసులు

నిందితుడితో యమున నగర్ పోలీసులు

Ex-boyfriend murdered teen: యమునానగర్ (Yamunanagar) లో లభించిన రెండు రోజుల క్రితం తప్పిపోయిన 19 ఏళ్ల యువతి మృతదేహం మిస్టరీ వీడింది. ఆ యువతిని తన ఫ్రెండే చంపేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

Ex-boyfriend murdered teen: బ్యూటీ సెలూన్ లో పని..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యువతి బోర్డు పరీక్షలు రాసి, స్థానికంగా ఉన్న బ్యూటీ సెలూన్ లో పని చేస్తోంది. పై చదువులకు విదేశాలకు వెళ్లడం కోసం పాస్ పోర్ట్ కోసం కూడా అప్లై చేసుకుంది. ఆ యువతికి కొన్నేళ్ల క్రితం స్థానికంగా ఒక రెస్టారెంట్లో పని చేసే గౌరవ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. కొన్ని రోజుల తరువాత ఆమెను వేధించడం ప్రారంభించడంతో ఆమె కుటుంబ సభ్యులు 2020లో అతడిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఆ తరువాత తాను మారిపోయానని చెప్పి మళ్లీ, ఆ యువతికి, ఆమె కుటుంబ సభ్యులకు గౌరవ్ దగ్గరయ్యాడు. వారం రోజుల క్రితం సెలూన్ మూసివేసే సమయంలో అక్కడికి వెళ్లిన గౌరవ్.. మాట్లాడాలని చెప్పి, ఆ యువతిని దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను కోరాడు. ఆమె నిర్ద్వంద్వంగా నిరాకరించడంతో కోపంతో ఆమెపై అక్కడ ఉన్న పెద్ద రాయితో దాడి చేశాడు. రాయితో తలపై కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తరువాత, ఆమె చనిపోలేదన్న అనుమానంతో గొంతు నులిమి హతమార్చాడు. మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి దగ్గర్లోని ఖాళీ స్థలంలో పడేశాడు.

Ex-boyfriend murdered teen: అనుమానం రాకుండా ఉండడం కోసం..

అయితే, ఆమె కుటుంబ సభ్యులకు, పోలీసులకు అనుమానం రాకుండా ఉండడం కోసం వారితో కలసి ఆ యువతి కోసం వెతకసాగాడు. అనంతరం పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా, అసలు విషయం బయటపడింది. దాంతో, అతడిని అరెస్ట్ చేసి, చార్జిషీట్ నమోదు చేశారు. తన కూతురుకి చదువంటే ప్రాణమని, పై చదువులకు వెళ్లాలని కలలు కనేదని ఆ యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సెలూన్ లో ఉద్యోగానికి చేరి నెల రోజులు కూడా కాలేదని, తొలి జీతమైన రూ. 8 వేల కోసం ఎంతో ఎదురు చూసేదని గుర్తు చేసుకుంటున్నారు. బ్యూటీషియన్ కావాలని తన లక్ష్యమని, సెలూన్ లో ఉద్యోగం వచ్చిన రోజు సంతోషంతో ఎగిరి గంతులు వేసిందని గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు.

తదుపరి వ్యాసం