తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hanuman Jayanti Advisory: హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు

Hanuman Jayanti advisory: హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు

HT Telugu Desk HT Telugu

05 April 2023, 17:07 IST

  • Hanuman Jayanti advisory: శ్రీరామ నవమి ఉత్సవాల సమయంలో పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బిహార్ ల్లో అల్లర్లు చోటు చేసుకున్ననేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hanuman Jayanti advisory: హనుమాన్ జయంతి (Hanuman Jayanti) ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. హనుమాన్ జయంతిని గురువారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

Hanuman Jayanti advisory: శాంతి భద్రతలు జాగ్రత్త

హనుమాన్ జయంతి (Hanuman Jayanti) ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఉత్సవాల్లో, శోభా యాత్రల సమయంలో పూర్తి అప్రమత్తతతో ఉండాలని హెచ్చరించింది. మత సామరస్యాన్ని దెబ్బ తీసే సంఘటనలపై తక్షణమే స్పందించాలని సూచించింది. శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా గతవారం పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బిహార్ ల్లో అల్లర్లు చోటు చేసుకున్ననేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది. హనుమాన్ జయంతి (Hanuman Jayanti) ఊరేగింపు సమయంలో స్థానిక పోలీసులకు ఆర్మీ, పారా మిలిటరీ దళాలు సహకరించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కలకత్తా హై కోర్టు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు.

Hanuman Jayanti advisory: ఢిల్లీలో ఫ్లాగ్ మార్చ్

హనుమాన్ జయంతి (Hanuman Jayanti) సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఢిల్లీలోని సున్నితమైన ప్రాంతమైన జహంగీర్ పురి లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ (flag march) నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఊరేగింపు నిర్వహించడానికి అనుమతి కోరుతూ విశ్వ హిందూ పరిషత్ (VHP) తో పాటు మరో హిందూ సంస్థ పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించారు. గత సంవత్సరం హనుమాన్ జయంతి (Hanuman Jayanti) సందర్భంగా జహంగీర పురి ప్రాంతంలో మత కలహాలు చోటు చేసుకున్నాయి.

తదుపరి వ్యాసం