తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us President Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మరో అడుగు ముందుకు వేసిన ట్రంప్, బైడెన్

US President elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మరో అడుగు ముందుకు వేసిన ట్రంప్, బైడెన్

HT Telugu Desk HT Telugu

20 March 2024, 12:18 IST

  • US President elections: తమ తమ పార్టీల్లో అధ్యక్ష అభ్యర్థులుగా దాదాపు ఖరారైన డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్.. అమెరికా అధ్యక్ష రేసులో ప్రత్యర్థులుగా పోటీ పడే విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. ఫ్లోరిడా, ఓహాయో ల్లో జరిగిన ప్రైమరీల్లో వారిద్దరు అదనపు డెలిగేట్లను దక్కించుకున్నారు.

డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్
డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ (AFP)

డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్

Trump and Biden to contest in US President elections: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫ్లోరిడా, ఓహాయో ల్లో జరిగిన ప్రైమరీల్లో అదనపు డెలిగేట్లను పొందారు. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ తరఫున జో బైడెన్ నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడనున్నారు.

ఫ్లోరిడా, ఒహాయోల్లో విజయం..

ఫ్లోరిడా, ఒహాయో రాష్ట్రాల్లో ట్రంప్ (Donald Trump), బైడెన్ లు విజయం సాధించారు. అదే సమయంలో, ఆ రాష్ట్రాల్లో సెనేట్ రేసు అధ్యక్ష రేసు కన్నా ఆసక్తికరంగా ఉంది. మరోవైపు, ఫ్లోరిడా రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీలో విజేతగా ట్రంప్ కు మద్దతు లభించగా, డెమొక్రాట్లకు ఒక్క సీటు కూడా దక్కలేదు. ప్రచారం నుంచి తప్పుకున్నప్పటికీ, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీని ఓహాయో, ఇల్లినాయిస్ వంటి రాష్ట్రాల్లో బ్యాలెట్ లో ఉంచారు.

స్వింగ్ రాష్ట్రాలపై దృష్టి

డెలిగేట్ల వైపు నుంచి తమకు మద్దతు లభించడంతో ట్రంప్, బైడెన్ ఇద్దరూ ఎన్నికల తుది ఫలితాలను ప్రభావితం చేసే స్వింగ్ రాష్ట్రాలపై దృష్టి సారించారు. తమ ప్రచార ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాగా, ఇమిగ్రేషన్ కు సంబంధించి ట్రంప్ విధానాలపై జో బైడెన్ (Joe Biden) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. యువత, లాటినో కమ్యూనిటీలను ఆకర్షించేలా జో బైడెన్ తన ప్రచార వ్యూహాలను రూపొందించుకున్నట్లు కనిపిస్తోంది. వలసలు, అబార్షన్లపై ట్రంప్ విధానాలను విమర్శించడానికి బైడెన్ ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఫ్లోటింగ్ ఓటర్లను గెలుచుకోవడంలో ఈ వ్యూహం ప్రధాన పాత్ర పోషిస్తుందనే నమ్మకంతో బైడెన్ ఉన్నారు.

ఆరిజోనాలో మరో అభ్యర్థి

మరోవైపు అరిజోనాలో అధ్యక్ష ఎన్నికల్లో సెల్ఫ్ హెల్ప్ బుక్స్ రచయిత మరియానే విలియమ్సన్ (Marianne Williamson) కు డెమోక్రటిక్ ఓటర్లు మద్దతు పలికారు. బైడెన్ కు విరుద్ధంగా, విలియమ్సన్ శాశ్వతమైన శాంతి కోసం పిలుపునిచ్చారు. ఇది ఇతర విదేశాంగ విధాన దృక్పథాలను పరిగణనలోకి తీసుకునే చాలా మంది ప్రజలను ఆకర్షిస్తోంది. ఓహాయోలో, పాలస్తీనా అనుకూల మద్దతుదారులు బ్యాలెట్ ను ఖాళీగా ఉంచి"లీవ్ ఇట్ బ్లాంక్" విధానం ద్వారా గాజా యుద్ధం విషయంలో బైడెన్ విధానాలపై నిరసన తెలపాలని కోరుతున్నారు.

ట్రంప్ న్యాయ వివాదాలు

డొనాల్డ్ ట్రంప్ పై అనేక కేసులు కోర్టుల్లో ఉన్నాయి. న్యాయపరమైన సమస్యలు, వివాదాల నేపధ్యంలోనే ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల (US Presidential elections) ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తనపై ఉన్న 2020 ఎన్నికలను రద్దు చేయడానికి కుట్ర పన్నారనే కేసును కొట్టివేయాలని డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టును కోరారు. అయితే, ఆ కేసును సుప్రీంకోర్టు ఇంకా విచారించాల్సి ఉంది.

తదుపరి వ్యాసం