తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  హనుమంతుడి జన్మస్థలం కోసం 'చర్చ​'- ఆ నిర్ణయమే ఫైనల్​!

హనుమంతుడి జన్మస్థలం కోసం 'చర్చ​'- ఆ నిర్ణయమే ఫైనల్​!

HT Telugu Desk HT Telugu

29 May 2022, 17:45 IST

    • Hanuman birth place | దేశంలో హనుమంతుడి జన్మస్థలంపై వివాదం నెలకొన్న తరుణంలో ఈ నెల 31న మహారాష్ట్రలో ఓ కార్యక్రమం జరగనుంది. హనుమంతుడు.. కర్ణాటకలో జన్మించాడా? లేక ఆయన జన్మస్థలం మహారాష్ట్రనా? అన్న విషయంపై చర్చలు జరిపి, తుది నిర్ణయం తీసుకోనున్నారు.
హనుమంతుడి జన్మస్థలం కోసం 'చర్చ​'- ఆ నిర్ణయమే ఫైనల్​
హనుమంతుడి జన్మస్థలం కోసం 'చర్చ​'- ఆ నిర్ణయమే ఫైనల్​ (HT PHOTO)

హనుమంతుడి జన్మస్థలం కోసం 'చర్చ​'- ఆ నిర్ణయమే ఫైనల్​

Hanuman birth place | హనుమంతుడి జన్మస్థలంపై గతకొంత కాలంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. కాగా.. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఈ నెల 31న 'ధర్మ సంసద్​' జరగనుంది. మహారాష్ట్ర నాసిక్​ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో పలువురు సాధువులు పాల్గొని.. హనుమంతుడు మహారాష్ట్రలో జన్మించాడా? లేక ఆయన జన్మస్థలం కర్ణాటకనా? అని చర్చిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

ఈ ధర్మ సంసద్​ని మహంత్​ శ్రీ మండలాచార్య పీఠాధీశ్వర్​కు చెందిన స్వామి అనికేత్​ శాస్త్రి దేశ్​పాండే మహారాజ పిలుపునిచ్చారు. సంసద్​లో తీసుకునే నిర్ణయాన్ని అందరు గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. అందులో తీసుకున్న నిర్ణయమే ఫైనల్​ అని స్పష్టం చేశారు.

నాసిక్​లోని ఆంజనేరి అనే ప్రాంతంలో హనుమంతుడి జన్మస్థలం ఉందని ప్రచారం సాగింది. కాగా.. అది తప్పు అని కర్ణాటకకు చెందిన మహంత్​ గోవింద్​ దాస్​ ఆరోపించారు. హనుమంతుడి జన్మస్థలం.. కర్ణాటకలోని కిష్కింద అని చెబుతున్నారు. ఒక వ్యక్తికి ఒకటే జన్మస్థలం ఉంటుందని, హనుమంతుడికి అది కిష్కింద మాత్రమేనని తేల్చేస్తున్నారు. ఇందుకు వాల్మీకి రామయణాన్ని ప్రూఫ్​గా చూపిస్తున్నారు.

గోవింద్​ దాస్​.. ఇటీవలే త్రయంబకేశ్వరానికి రథంలో వెళ్లారు. అక్కడి నుంచి నాసిక్​కు వెళ్లి సాధువులు జరిపే ధర్మ సంసద్​లో పాల్గొంటారు.

అంజనాద్రి..!

కాగా.. హనుమంతుడి జన్మస్థలం.. కర్ణాటక​లోని 'అంజనాద్రి' అని దక్షిణాది ప్రజలు విశ్వసిస్తారు.

తదుపరి వ్యాసం