తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Csir Ugc Net 2023: యూజీసీ నెట్ 2023 ఆన్సర్ కీ ని ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

CSIR UGC NET 2023: యూజీసీ నెట్ 2023 ఆన్సర్ కీ ని ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu

06 January 2024, 21:01 IST

    • CSIR UGC NET 2023 answer key: యూజీసీ నెట్ 2023 ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల అయింది. ఈ ఆన్సర్ కీ ని csirnet.nta.ac.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CSIR UGC NET 2023 answer key: సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ (UGC NET) 2023 ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2023 డిసెంబర్ నెలలో నిర్వహించింది. ఆ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని శనివారం విడుదల చేశారు. ఆన్సర్ కీ csirnet.nta.ac.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

సెంట్రల్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CSIR UGC NET 2023) ను 2023, డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో ఎన్టీఏ నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (nta) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీని అధికారిక వెబ్సైట్ నుంచి csirnet.nta.ac.in డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా ఆన్సర్ కీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

  • ముందుగా సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ అధికారిక వెబ్ సైట్ csirnet.nta.ac.in ను ఓపెన్ చేయండి.
  • హోం పేజీపై కనిపిస్తున్న CSIR UGC NET 2023 answer key లింక్ పై క్లిక్ చేయండి.
  • లాగిన్ వివరాలు నమోదు చేయండి.
  • స్క్రీన్ పై ఆన్సర్ కీ పీడీఎఫ్ కనిపిస్తుంది.
  • భవిష్యత్ అవసరాల కోసం పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోండి.

CSIR UGC NET 2023 answer key: తప్పులుంటే సవాలు చేయొచ్చు

ఈ ఆన్సర్ కీలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు భావిస్తే, వారు ఆ సమాధానాన్ని సవాలు చేయవచ్చు. అయితే, సవాలు చేసే ఒక్కో ప్రశ్నకు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ ప్రశ్నకు నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.200 చెల్లించి సవాలు చేయవచ్చు. అభ్యర్థులు 2024 జనవరి 8 వరకు తమ అభ్యంతరాలు తెలపవచ్చు.

తదుపరి వ్యాసం