UGC NET 2023: యూజీసీ నెట్ పరీక్ష తేదీలు ఇవే; సబ్జెక్ట్ వైజ్ గా చెక్ చేసుకోండి..-ugc net 2023 subject wise exam schedule released at the nta ac in notice here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ugc Net 2023 Subject Wise Exam Schedule Released At The Nta.ac.in, Notice Here

UGC NET 2023: యూజీసీ నెట్ పరీక్ష తేదీలు ఇవే; సబ్జెక్ట్ వైజ్ గా చెక్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu
Nov 17, 2023 02:43 PM IST

UGC NET 2023: ఈ డిసెంబర్ లో జరిగే యూజీసీ నెట్ పరీక్ష తేదీలను సబ్జెక్టుల వారీగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT file)

UGC NET 2023: మొత్తం 83 సబ్జెక్టుల్లో పరిశోధక విద్యార్థులకు ఫెలోషిప్ తో పాటు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ లకు అర్హత అందించే యూజీసీ నెట్ (UGC NET 2023) డిసెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency, NTA) నిర్వహిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

యూజీసీ నెట్ 2023

ఈ సంవత్సరం డిసెంబర్ లో జరిగే యూజీసీ నెట్ కు సంబంధించిన సబ్జెక్ట్ వారీ పరీక్షల షెడ్యూల్‌ను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ వివరాలు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ nta.ac.inలో అందుబాటులో ఉన్నాయి. అలాగే, సిటీ ఎగ్జామినేషన్ సెంటర్ వివరాలు పరీక్షకు 10 రోజుల ముందు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తారు. యూజీసీ నెట్ డిసెంబర్ 2023 పరీక్షలు డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 22 వరకు జరుగుతాయి. రెండు షిఫ్ట్‌లలో ఈ పరీక్షలు ఉంటాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. UGC NET 2023 ఫలితాలు జనవరి 10, 2024న ప్రకటిస్తారు.

సబ్జెక్టుల వారీగా..

యూజీసీ నెట్, డిసెంబర్ పరీక్షలు సబ్జెక్టుల వారీగా ఈ కింద పేర్కొన్న తేదీలలో నిర్వహించనున్నారు..

  • ఇంగ్లీష్, హిస్టరీ - డిసెంబర్ 6
  • కామర్స్, కంప్యూటర్ సైన్స్ - డిసెంబర్ 7
  • పబ్లిక్ అడ్మినిస్ట్రేష్, ఫిలాసఫీ - డిసెంబర్ 8
  • పొలటికల్ సైన్స్, హిందీ - డిసెంబర్ 11
  • జాగ్రఫీ, సోషియాలజీ - డిసెంబర్ 12
  • అన్ని సబ్జెక్టుల డేట్స్ కోసం nta.ac.in వెబ్ సైట్ లో అభ్యర్థులు చెక్ చేసుకోవాలి.
  • మరింత సమాచారం కోసం విద్యార్థులు 011-40759000 లో సంప్రదించవచ్చు లేదా ugcnet@nta.ac.inకి ఇమెయిల్ చేయవచ్చు.
  • UGC NET December 2023 examination schedule

WhatsApp channel