తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cryptocurrency Prices Today : మళ్లీ పతనమైన 'క్రిప్టో'.. బిట్​కాయిన్​ 6శాతం డౌన్​

Cryptocurrency prices today : మళ్లీ పతనమైన 'క్రిప్టో'.. బిట్​కాయిన్​ 6శాతం డౌన్​

Sharath Chitturi HT Telugu

27 August 2022, 8:28 IST

    • Cryptocurrency prices today : క్రిప్టోకరెన్సీలు మళ్లీ పతనమయ్యాయి. బిట్​కాయిన్​ 6శాతం మేర నష్టపోయింది.
మళ్లీ పతనమైన 'క్రిప్టో'.. బిట్​కాయిన్​ 6శాతం డౌన్​
మళ్లీ పతనమైన 'క్రిప్టో'.. బిట్​కాయిన్​ 6శాతం డౌన్​

మళ్లీ పతనమైన 'క్రిప్టో'.. బిట్​కాయిన్​ 6శాతం డౌన్​

Cryptocurrency prices today : క్రిప్టోకరెన్సీ ధరలు శనివారం భారీగా పతనమయ్యాయి. బిట్​కాయిన్​.. 21,000 డాలర్ల దిగువన ట్రేడ్​ అవుతోంది. ప్రపంచంలో ప్రముఖ క్రిప్టోకరెన్సీల్లో ఒకటైన బిట్​కాయిన్​ ధర.. 6శాతం పతనమై, 20,298 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Fact Check: రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఎల్.కే.అడ్వాణీ ఈ వ్యాఖ్యలు చేయలేదు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

కాయిన్​గెకో వెబ్​సైట్​ ప్రకారం.. ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్​ క్యాపిటల్​.. 24 గంటల్లో 1.02 ట్రిలియన్​ డాలర్లు పతనమైంది. అయినప్పటికీ.. మార్కెట్​ క్యాపిటల్​ 1 ట్రిలియన్​ డాలర్​ మార్క్​ ఎగువనే ఉంది.

మరోవైపు రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎథర్​.. 10శాతం నష్టపోయి 1,509 డాలర్ల వద్ద ట్రేడ్​ అవుతోంది. క్రిప్టో మార్కెట్​లో గత కొంత కాలంగా ఎథర్​ మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ.. అనూహ్యంగా పడటంతో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు.

అయితే.. 'మెర్జ్​' సాఫ్ట్​వేర్​ అప్డేట్​ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుండటా.. ఎథర్​లో పెట్టుబడి పెట్టిన వారికి ఊరటనిచ్చే విషయం. సెప్టెంబర్​ 20 నాటికి ఈ సాఫ్ట్​వేర్​ అప్డేట్​ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలుస్తోంది.

Bitcoin price today : ఇక మరో క్రిప్టోకరెన్సీ డోగీకాయిన్​.. 7శాతం మేర పతనమై.. 0.06 డాలర్ల వద్ద కొనసాగుతోంది. షిబా ఇను క్రిప్టో కరెన్సీ.. 10శాతం పడిపోయి 0.000013 డాలర్ల వద్ద ట్రేడ్​ అవుతోంది.

ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వార్త స్టాక్​ మార్కెట్​తో పాటు క్రిప్టో కరెన్సీపైనా ప్రభావం చుపించింది. ద్రవ్యోల్బణం కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామని, వడ్డీ రేట్లను భారీగా పెంచుతామని ఫెడ్​ ఛైర్మన్​ పావెల్​ ఇచ్చిన సంకేతాలు మార్కెట్లకు ప్రతికూలంగా మరాయి.

"రానున్న రోజుల్లో వడ్డీ రేట్లను మరింత పెంచుతాము. ఈ చర్యలతో ప్రజలు, వ్యాపారులకు బాధ కలగవచ్చు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించవచ్చు. ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలంటే ఈ బాధను భరించక తప్పదు. కానీ ధరల్లో స్థిరత్వాన్ని తిరిగి తీసుకురాకపోతే కలిగే బాధ ఇంకా దారుణంగా ఉంటుంది. అందుకే వడ్డీ రేట్ల పెంపు తప్పదు," అని ఫెడ్​ ఛైర్మన్​ పావెల్​ అభిప్రాయపడ్డారు.

ఈ పరిణామాలతో అమెరికా స్టాక్​ మార్కెట్లు భారీగా, ఒక్కసారిగా పతనమయ్యాయి. మదుపర్లలో మళ్లీ భయాలు మొదలయ్యాయి. ఫలితంగా డౌ జోన్స్​ సూచీ.. ఏకంగా 1000పాయింట్లు పతనమైంది.

బిట్​కాయిన్​.. గత శుక్రవారం నుంచి 22000-20000 డాలర్ల మధ్యే కదలాడుతోంది. అయితే.. జూన్​ కనిష్ఠాల నుంచి బిట్​కాయిన్​ కోలుకోవడం మదుపర్లకు ఉపశమనం కలిగించిన వార్త.

ఏదిఏమైనా క్రిప్టోలో పెట్టుబడి కాస్త రిస్క్​తో కూడుకున్న వ్యవహారమని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన రిస్క్​ని తీసుకోగలిగేవారే పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు.

తదుపరి వ్యాసం