తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crpf Constable Recruitment 2023: 1.30 లక్షల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

CRPF Constable Recruitment 2023: 1.30 లక్షల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu

06 April 2023, 9:25 IST

  • CRPF Constable Recruitment 2023: సీఆర్‌పీఎఫ్‌లో లక్షా 30 వేల కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను హోం మంత్రిత్వ శాఖ భర్తీ చేయనుంది.. అభ్యర్థులు విద్యార్హత, ఇతర వివరాలను ఇక్కడ చూడొచ్చు.

1.30 లక్షల పోస్టులు భర్తీ చేయనున్న కేంద్ర హోం శాఖ
1.30 లక్షల పోస్టులు భర్తీ చేయనున్న కేంద్ర హోం శాఖ

1.30 లక్షల పోస్టులు భర్తీ చేయనున్న కేంద్ర హోం శాఖ

సీఆర్‌పీఎఫ్‌లో 1.30 లక్షల కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో లెవల్ 3 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1,29,929 పోస్టులు రిక్రూట్ చేస్తారు. వీటిలో 1,25,262 పోస్టులు పురుషులతో భర్తీ చేస్తారు. 4,467 పోస్టులు మహిళా అభ్యర్థులతో భర్తీ చేస్తారు. కానిస్టేబుల్ పోస్టుకు రిక్రూట్‌మెంట్ కోసం 10 శాతం ఖాళీలు ఎక్స్-అగ్నివీర్లకు కేటాయిస్తారు.

పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టుకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి వయస్సు 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, వ్రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రొబేషన్ పీరియడ్ 2 సంవత్సరాలు ఉంటుంది. పే మ్యాట్రిక్స్ రూ. 21700-69100. దరఖాస్తు ప్రక్రియ తేదీలు ఇంకా అధికారిక నోటీసులో ప్రకటించలేదు. హోం మంత్రిత్వ శాఖ అధికారిక వివరణాత్మక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

తదుపరి వ్యాసం