తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India China Relation : భారత్​తో సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు

India China relation : భారత్​తో సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు

25 December 2022, 12:14 IST

  • India China border dispute : భారత్​తో సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. అరుణాచల్​ ప్రదేశ్​లో సరిహద్దు ఘర్షణ తర్వాత చైనా నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

భారత్​తో సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు
భారత్​తో సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు

భారత్​తో సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు

India China relation : భారత్​తో సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరుదేశాల మైత్రి వృద్ధి చెందే విధంగా.. భారత్​తో నిలకడగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. చైనా విదేశాంగమంత్రి వాంగ్​ యీ ఈ మేరకు వ్యాఖ్యానించినట్టు ఆ దేశ విదేశాంగశాఖ వెబ్​సైట్​ పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

భారత్​తో సంబంధంపై ఇటీవలే మీడియాతో మాట్లాడారు వాంగ్​ యీ.

India China border clash : "దౌత్య, మిలిటరీ పరంగా భారత్​- చైనాలు సమాచార వ్యవస్థను కొనసాగిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ఇరు దేశాలు కూడా కట్టుబడి ఉన్నాయి. భారత్​- చైనా మధ్య స్థిరమైన, పటిష్ఠమైన సంబంధాల కోసం పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము," అని వాంగ్​ యీ పేర్కొన్నారు.

ఈ నెల 9న.. భారత్​- చైనా సైనికుల మధ్య అరుణాచల్​ ప్రదేశ్ తవాంగ్​ సెక్టార్​​ సరిహద్దుల్లో ఘర్షణ నెలకొందన్న వార్తల నేపథ్యంలో ఇరుదేశాల మైత్రిపై చైనా విదేశాంగమంత్రి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

India China Tawang clash : సరిహద్దు ఘర్షణ తర్వాత భారత్​-చైనా దేశాలు ఈ నెల 20న ఓ సమావేశాన్ని నిర్వహించాయి. చుషుల్​- మాల్డో సరిహద్దులో ఈ 17వ కార్ప్స్​ కమాండర్​ స్థాయి సమావేశం జరిగింది. సరిహద్దులో భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించాలని ఇరు పక్షాలు ఓ అంగీకారానికి వచ్చాయని భారత్​ విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

"వెస్టెర్న్​ సెక్టార్​లో భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. సన్నిహితంగా ఉంటూ.. దౌత్య, మిలిటరీ మార్గాల్లో చర్చలు నిర్వహిస్తూ, సరిహద్దు సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టాలని ఇరువైపుల అధికారులు నిర్ణయించారు," అని భారత దేశ విదేశాంగశాఖ పేర్కొంది.

భారత్​- చైనా మధ్య అలజడులు..

"భారత్​-చైనా సైనికుల మధ్య డిసెంబర్​ 9న తవాంగ్​ ఘర్షణ జరిగింది. ఈ ఘటనతో ఇరువైపులా పలువురు గాయపడ్డారు. భారత సైనికులెవ్వరికి తీవ్ర గాయాలు అవ్వలేదు. ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. భారత కమాండర్​లు తక్షణమే స్పందించడంతో చైనా సైన్యం వెనుదిరిగింది. సరిహద్దు వద్ద ఘర్షణ నేపథ్యంలో దౌత్య మార్గంలో చైనాతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడింది. సరిహద్దు వెంబడి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మన సైన్యం సిద్ధంగా ఉంది," అని లోక్​సభ వేదికగా కొన్ని రోజుల క్రితం రాజ్​నాథ్​ సింగ్​ స్పష్టం చేశారు.

భారత్​- చైనా మధ్య గత కొంతకాలంగా సత్సంబంధాలు లేవు. 2020 గల్వాన్​ ఘర్షణ నేపథ్యంలో సరిహద్దు వెంబడి ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. దాదాపు రెండేళ్లకు.. అనేక దశల చర్చల తర్వాత ఇప్పుడిప్పుడే సరిహద్దు వెంబడి శాంతి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇరువైపుల మధ్య ఘర్షణ తలెత్తడం సర్వత్రా ఆందోళనకు గురిచేసే విషయం.

తదుపరి వ్యాసం