China vs Taiwan: తైవాన్‍పై దాడి చేసేందుకు చైనా సిద్ధమైందా? తైపీ మంత్రి ఏమన్నారంటే..-china to invade taiwan by year end taipei says quite sure of chinese military aggression ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  China Vs Taiwan: తైవాన్‍పై దాడి చేసేందుకు చైనా సిద్ధమైందా? తైపీ మంత్రి ఏమన్నారంటే..

China vs Taiwan: తైవాన్‍పై దాడి చేసేందుకు చైనా సిద్ధమైందా? తైపీ మంత్రి ఏమన్నారంటే..

Dec 12, 2022 07:59 PM IST Chatakonda Krishna Prakash
Dec 12, 2022 07:59 PM IST

China vs Taiwan: చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తైవాన్ సరిహద్దుల్లో చైనా నానాటికీ సైనిక బలగాలను, యుద్ధ విమానాలను, యుద్ధ ట్యాంకులను మోహరించడాన్ని పెంచుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. తమ దేశంపై దాడికి పాల్పడేందుకు చైనా సిద్ధమవుతోందని భావిస్తున్నట్టు తైవాన్ విదేశాంగ శాఖ మంత్రి జోసెఫ్ వూ (Joseph Wu) అన్నారు. గార్డియన్‍తో ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు కంటే సరిహద్దుల్లో చైనా మిలటరీ ముప్పు చాలా ఎక్కువైందని అన్నారు. 2020 నుంచి తమ దేశ సరిహద్దుల్లో యుద్ధ విమానాల మోహరింపును చైనా ఐదు రెట్లు పెంచిందని అన్నారు. చైనా అధ్యక్షుడిగా షీ జిన్‍పింగ్ మూడోసారి కూడా బాధ్యతలు చేపట్టటంతో చర్చలకు అవకాశం మరింత తగ్గిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

More