తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  China Earthquake Today : చైనాలో భూకంపం.. 110మంది మృతి- భారీగా ఆస్తి నష్టం!

China earthquake today : చైనాలో భూకంపం.. 110మంది మృతి- భారీగా ఆస్తి నష్టం!

Sharath Chitturi HT Telugu

19 December 2023, 6:00 IST

    • China earthquake today : చైనాలో సంభవించిన భూకంపం ధాటికి.. 100మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు!
చైనాలో భూకంపం.. 100మంది మృతి!
చైనాలో భూకంపం.. 100మంది మృతి!

చైనాలో భూకంపం.. 100మంది మృతి!

China earthquake today : భూకంపం ఘటనతో చైనా ఉలిక్కిపడింది. వాయువ్య చైనాలోని గాన్సూ రాష్ట్రంలో స్థానిక కాలామానం ప్రకారం సోమవారం అర్థరాత్రి సమయంలో భూమి కంపించింది. ఈ ఘటనలో 110కుపైగా మంది ప్రజలు మరణించినట్టు తెలుస్తోంది. వందలాది మంది గాయపడినట్టు సమాచారం.

చైనా అధికారుల ప్రకారం.. గాన్సూకు 100 కి.మీల దూరంలోని ఖింఘై వద్ద భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేల్​పై భూకంపం తీవ్రత 6.2గా నమోదైందని స్థానిక మీడియా సంస్థ పేర్కొంది. కాగా.. అమెరికా జియోలాజికల్​ సర్వే మాత్రం.. భూకంపం తీవ్రత 5.9 అని చెబుతోంది.

చైనాలో భూకంపం ఘటనలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగినట్టు తెలుస్తోంది! భూ ప్రకంపనలతో.. అప్పటి వరకు నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడి.. రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. మరోవైపు.. భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టం అయినట్టు సమాచారం.

Gansu earthquke live updates : చైనాలో భూకంపం ఘటనపై ఆ దేశాధ్యక్షుడు జిన్​పింగ్​ వెంటనే స్పందించారు. సహాయక చర్యలను వెంటనే మొదలుపెట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. భూకంప బాధిత ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

తాజా భూకంపం ఘటనతో గాన్సూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. నీటి సరఫరా కూడా దెబ్బతినట్టు అక్కడి మీడియా సంస్థలు చెబుతున్నాయి.

చైనాలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఆగస్ట్​ నెలలో 5.4 తీవ్రతతో తూర్పు చైనాలో సంభవించిన భూకంపం ధాటికి 23మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలు కుప్పకూలాయి. 2022 సెప్టెంబర్​లో 6.6 తీవ్రతో, సిచౌన్​ రాష్ట్రంలో భూమి కంపించగా.. 100మంది మరణించారు.

China earthquake latest news : 2008లో 7.9 తీవ్రతతో వచ్చిన భూకంపం..చైనా ప్రజలకు పీడకలగా మిగిలిపోయింది. నాడు.. 87వేల మంది ప్రాణాలు కోల్పోయారు/ గల్లంతయ్యారు. వేలాది మంది గాయపడ్డారు.

ప్రపంచం పరిస్థితి కూడా ఇదే..!

ప్రపంచవ్యాప్తంగ భూకంపాల ఘటనలు పెరిగిపోతున్నాయి. పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​, నేపాల్​, మెక్సికో దేశాలు భూ ప్రకంపనలతో వణికిపోతున్నాయి. నేపాల్​లో నవంబర్​లో వచ్చిన భూకంపానికి 140మంది బలయ్యారు. ఇక అఫ్గానిస్థాన్​లో అక్టోబర్​లో వచ్చిన భూకంపం ధాటికి మృతుల సంఖ్య 2వేలు దాటింది.

Delhi earthquake today : ఉత్తర భారతంలో కూడా భూకంపాలు తరచూ ప్రజలను భయపెడుతున్నాయి. ముఖ్యంగా దిల్లీ, లక్నో వంటి రద్దీ ఉందే ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారుతున్నాయి.

తదుపరి వ్యాసం