Morocco earthquake : 2వేలు దాటిన మొరాకో భూకంపం మృతుల సంఖ్య!-morocco earthquake death toll passes 2000 many injured ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Morocco Earthquake : 2వేలు దాటిన మొరాకో భూకంపం మృతుల సంఖ్య!

Morocco earthquake : 2వేలు దాటిన మొరాకో భూకంపం మృతుల సంఖ్య!

Sharath Chitturi HT Telugu
Sep 10, 2023 11:40 AM IST

Morocco earthquake : మొరాకో భూకంపం మృతుల సంఖ్య 2000 దాటింది. 2వేలకుపైగా మంది గాయపడ్డారు. అక్కడి పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి.

2వేలు దాటిన మొరాకో భూకంపం మృతుల సంఖ్య!
2వేలు దాటిన మొరాకో భూకంపం మృతుల సంఖ్య! (AP)

Morocco earthquake : మొరాకో దేశంలో శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం.. పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య 2వేలను దాటింది. అనేక మంది ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉన్నారు. వీరిని రక్షించేందుకు సహాయక యంత్రాంగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

మొరాకోలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించగా.. ఇప్పటివరకు 2,012 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2,059మంది గాయపడ్డారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఫలితంగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

టూరిస్ట్​ హబ్​గా పేరొందిన ముర్రకేశ్​కు 72 కి.మీల దూరంలో.. శుక్రవారం రాత్రి, భూమి కంపించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని అనేక గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయని తెలుస్తోంది. అనేక నివాసాలు ధ్వంసమయ్యాయి. పలు ఇళ్లు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాయి.

Morocco earthquake death toll : "నేను నా సర్వస్వాన్ని కోల్పోయాను," అని మౌలే బ్రాహ్మిన్​ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కన్నీరు పెట్టుకున్నాడు. మొరాకో భూకంపం ఘటనలో అతని భార్య, నలుగురు బిడ్డలు మరణించారని వెల్లడించాడు. సహాయక సిబ్బంది.. అతని ఇద్దరు సంతానాల మృతదేహాలను శిథిలాల కింద నుంచి బయటకు తీశారు. కానీ భార్య, మరో బిడ్డ వివరాలు ఇంకా తెలియలేదు.

ఇదీ చూడండి:- మాటలకు అందని విషాదం.. మొరాకో భూకంపంలో 600 దాటిన మృతుల సంఖ్య!

భూకంప బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. తీవ్రత అధికంగా ఉన్న అల్​-హౌజ్​ రాష్ట్రంలో యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలను చేపట్టింది. ఈ ఒక్క ప్రాంతంలోన 1,293మంది మరణించినట్టు తెలుస్తోంది.

పునరుద్ధరణకు ఏళ్లు గడిచిపోతాయి..!

Morocco earthquake news : మొరాకోలో భూకంపం తీవ్రత చాలా ఆందోళనకరంగా ఉంది. పతనమైన నగరాలను, గ్రామాలను పునఃనిర్మించడానికి.. ఏళ్లు గడిచిపోతాయని రెడ్​ క్రాస్​ చెబుతోంది.

ముర్రకెశ్​కు 60కి.మీల దూరంలో ఉన్న టఫెఘాటే గ్రామం పూర్తిగా ధ్వంసమైంది. చాలా కొన్ని ఇళ్లు మాత్రమే, భూప్రకంపనలను తట్టుకుని నిలబడ్డాయి.

"నా కోడలు, ముగ్గురు మనవళ్లు ప్రాణాలు కోల్పోయారు. వారు ఇంకా శిథిలాల కిందే ఉన్నారు. మొన్ననే మేమందరం కలిసి అడుకున్నాము. ఇంతలో ఇలా జరిగింది," అని ఓ వృద్ధుడు బాధపడ్డాడు.

Morocco earthquake video : ఓవైపు శిథిలాల కింద నుంచి మృతదేహాలను అధికారులు వెలికితీస్తుంటే.. మరోవేపు వాటిని అంత్యక్రియలు నిర్వహించే ప్రక్రియ సాగుతోంది. బంధువుల ఆర్థనాథాలతో శ్మశానవాటికల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మొరాకోలో 1960 తర్వాత ఈ స్థాయిలో భూకంపం సంభవించడం ఇదే తొలిసారి. నాడు.. భూకంపానికి 12వేల మంది బలయ్యారు.

Whats_app_banner

సంబంధిత కథనం