తెలుగు న్యూస్ / ఫోటో /
మాటలకు అందని విషాదం.. మొరాకో భూకంపంలో 600 దాటిన మృతుల సంఖ్య!
- మొరాకోను భూకంపం అస్తవ్యస్తంగా మార్చింది. శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం ఘటనలో మృతుల సంఖ్య 600 దాటింది! అనేకమంది గాయపడినట్టు తెలుస్తోంది.
- మొరాకోను భూకంపం అస్తవ్యస్తంగా మార్చింది. శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం ఘటనలో మృతుల సంఖ్య 600 దాటింది! అనేకమంది గాయపడినట్టు తెలుస్తోంది.
(1 / 5)
టూరిస్ట్ ప్రదేశమైన మర్రకేశ్లో శుక్రవారం రాత్రి 11:11 గంటలకు(స్థానిక కాలమానం).. 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇతర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.(REUTERS)
(2 / 5)
భూకంపం ధాటికి అనేక భవనాలు కదిలిపోయాయి. ఇంకొన్ని నేలమట్టం అయ్యాయి. భయంతో ప్రజలు బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి.(Al Maghribi Al Youm via REUTERS)
(3 / 5)
మొరాకో భూకంపంలో మృతుల సంఖ్య 632మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. మరో 329మంది గాయపడ్డారని వివరించారు. వీరిలో 51మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.(Al Maghribi Al Youm via REUTERS)
(4 / 5)
"భూకంపం ధాటికి నా మంచం ఎగిరిపోతుందేమో అని అనిపించింది. తీవ్రత చాలా ఎక్కువగా వచ్చింది. అందరం భయంతో బయటకు పరిగెత్తాము. సరిగ్గా బట్టులు కూడా వేసుకోలేదు. ఈ రోజును మేము మర్చిపోలేము," అని ఓ స్థానికుడు మీడియాకు వెల్లడించాడు.(via REUTERS)
ఇతర గ్యాలరీలు