తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chandrayaan-3: భారతీయులకు శుభవార్త; చంద్రయాన్ 3 తొలి దశ విజయవంతం

Chandrayaan-3: భారతీయులకు శుభవార్త; చంద్రయాన్ 3 తొలి దశ విజయవంతం

HT Telugu Desk HT Telugu

14 July 2023, 15:47 IST

  • Chandrayaan-3: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా ప్రారంభమైంది. తొలి దశలో ఎల్వీఎం 3 బాహుబలి రాకెట్ చంద్రయాన్ 3 (Chandrayaan-3) మోడ్యూల్స్ ను విజయవంతంగా నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. ప్రణాళిక ప్రకారం ప్రయోగం జరిగిందని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. 

చంద్రయాన్ 3 ప్రయోగంలో నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకువెళ్తున్న ఎల్వీఎం 3 రాకెట్.
చంద్రయాన్ 3 ప్రయోగంలో నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకువెళ్తున్న ఎల్వీఎం 3 రాకెట్. (ANI Pic Service)

చంద్రయాన్ 3 ప్రయోగంలో నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకువెళ్తున్న ఎల్వీఎం 3 రాకెట్.

Chandrayaan-3: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ (Chandrayaan) ప్రాజెక్టలో మూడో మిషన్ చంద్రయాన్ 3 (Chandrayaan-3) విజయవంతంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

నిర్దేశిత కక్షలోకి..

లాంచ్ ప్యాడ్ 2 నుంచి చంద్రయాన్ 3 (Chandrayaan-3) మోడ్యూల్స్ తో ఎల్వీఎం 3 బాహుబలి రాకెట్.. సరిగ్గా జులై 14, శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకుపోయింది. రాకెట్ లో తొలి దశలో సాలిడ్ ఫ్యూయోల్ ను, తరువాత దశల్లో లిక్విడ్ ఫ్యుయెల్ ను ఉపయోగించారు. చంద్రుడిపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా ల్యాండర్ ను దించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం.

చంద్రయాన్ ప్రయోగాలు..

ఇప్పటివరకు చంద్రయాన్ ప్రాజెక్టులో మూడు ప్రయోగాలు చేపట్టారు. మొదటి ప్రయోగం చంద్రయాన్ 1 (Chandrayaan-1) విజయవంతమైంది. అంతేకాదు, చంద్రుడిపై నీటి జాడలున్నాయని వెల్లడించి, ప్రపంచాన్ని భారత్ ఆశ్చర్యపరిచింది. 2019 లో చేపట్టిన రెండో ప్రయోగమైన చంద్రయాన్ 2 విఫలమైంది. నిజానికి చంద్రయాన్ 2 (Chandrayaan-2) పాక్షికంగా విజయవంతమైందని చెప్పవచ్చు. ఎందుకంటే, చివరి దశ అయిన ల్యాండింగ్ వరకు ఈ ప్రయోగం విజయవంతమైంది. కానీ, చంద్రుడి ఉపరితలంపైకి దిగే సమయంలో విఫలమై, కుప్పకూలిపోయింది. దాంతో, పూర్తి జాగ్రత్తలు తీసుకుని, మళ్లీ సాఫ్ట్ వేర్ ను పూర్తిగా మార్చి, చంద్రయాన్ 3 (Chandrayaan-3) ప్రయోగం చేపట్టారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ ఈ ప్రయోగంలో కీలక ఘట్టం. ఒకవేళ, ఈ ప్రయోగం విజయవంతమైతే, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఇప్పటివరకు ఈ ఘనత అమెరికా, సోవియట్ యూనియన్, చైనా సాధించాయి.

615 కోట్ల కనీస ఖర్చుతో..

చంద్రయాన్ 3 కోసం కనీస మొత్తమైన సుమారు రూ. 615 కోట్లను ఖర్చు చేశారు. చంద్రయాన్ 3 లో ప్రొపల్షన్ మోడ్యూల్, ల్యాండ్ మోడ్యూల్, రోవర్ మోడ్యూల్ ఉంటాయి. వీటిని దేశీయంగానే రూపొందించారు. ఆగస్ట్ మూడో వారంలో చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండర్ విజయవంతంగా దిగిన అనంతరం.. అందులో నుంచి ర్యాంప్, ర్యాంప్ పై నుంచి రోవర్ బయటకు వస్తాయి. రోవర్ కు ఆరు చక్రాలు ఉంటాయి. చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ ఆ రోవర్ తన చుట్టూ ఉన్న అడ్వాన్స్డ్ కెమరాలతో ఫొటోలను తీస్తుంది.

తదుపరి వ్యాసం