తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Tomato Price : ప్రజలకు గుడ్​ న్యూస్​.. రూ. 80కే కేజీ టమాటా!

Tomato price : ప్రజలకు గుడ్​ న్యూస్​.. రూ. 80కే కేజీ టమాటా!

Sharath Chitturi HT Telugu

16 July 2023, 14:34 IST

  • Tomato price today : ప్రజలకు కేంద్రం గుడ్​ న్యూస్​ ఇచ్చింది. సబ్సిడీ టమాటా ధరలను ఇంకాస్త తగ్గించింది. ఫలితంగా ప్రజలు కేజీ టమాటాలను రూ.80కే కొనుగోలు చేసుకోవచ్చు. అయితే..

ప్రజలకు గుడ్​ న్యూస్​.. రూ. 80కే కేజీ టమాటాలు!
ప్రజలకు గుడ్​ న్యూస్​.. రూ. 80కే కేజీ టమాటాలు! (naeem ansari)

ప్రజలకు గుడ్​ న్యూస్​.. రూ. 80కే కేజీ టమాటాలు!

Wholesale tomato price today : ఆకాశాన్ని తాకిన టమాటా ధరలను చూసి భయపడిపోతున్న ప్రజలకు ఊరట! సబ్సిడీలో ఇచ్చే టమాటాల ధరలను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఫలితంగా హోల్​సేల్​ మార్కెట్​లో టమాటాల సబ్సిడీ రేటును కేజీకి రూ. 90 నుంచి రూ. 80కి తగ్గించింది. దిల్లీ, ఎన్​సీఆర్​తో పాటు ఎంపిక చేసిన పలు రాష్ట్రాల్లోని నగరాల్లో ఈ రేట్లు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

దిల్లీ.. బిహార్​.. యూపీ..

దిల్లీలోని రీటైల్​ మార్కెట్​లతో పాటు ఇతర ప్రాంతాల్లో టమాటాలు డిస్కౌంటెడ్​ రేట్లలో అందుబాటులోకి వచ్చాయి. వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు.

"కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని హోల్​సేల్​ టమాటాల ధరలను తగ్గించింది. ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాస్త ఉపశమనం లభించనుంది," అని ఓ అధికారి వెల్లడించారు.

Center on Tomato price : దిల్లీతో పాటు నోయిడా, కాన్పూర్​, వారణాసి, పట్నా, ముజాఫర్​పూర్​లోని ఎన్​ఏఎఫ్​ఈడీ (నేషనల్​ లెవల్​ ఫార్మర్స్​ కో- ఆపరేటివ్​ మార్కెటింగ్​ ఆర్గనైజేషన్​), ఎన్​సీసీఎఫ్​ (నేషనల్​ కో-ఆపరేటివ్​ కన్జ్యూమర్​ ఫెడరేషన్​)ల ద్వారా సబ్సిడీ రేట్లకు టమాటాలను విక్రయిస్తోంది కేంద్రం.

ఇదీ చూడండి:- Vegetables Price : ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు - చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు

"దేశంలోని 500కుపైగా సప్లై పాయింట్లలో పరిస్థితులను పరిశీలించిన తర్వాత.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివార నుంచి సబ్సిడీలో ఇచ్చే కేజీ టమాటా ధర రూ. 80గా ఉండనుంది. దిల్లీ, బిహార్​, ఉత్తర్​ ప్రదేశ్​లలో తమ నిర్ణయం ఆదివారం అమల్లోకి వచ్చింది. మార్కెట్​లో ధర పరిస్థితి ఆధారంగా.. ఇతర నగరాల్లో సోమవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది," అని కేంద్రం ఓ ప్రకటన విడదుల చేసింది.

టమాటా.. గుండెలో మంట!

Tomato price in Hyderabad : సరైన సమయంలో పంట చేతికి రాకపోవడంతో టమాటా ధరలు నెల రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా చేతికి అందాల్సిన పంట నాశమైంది. అందుకే ధరల పరిస్థితి ఇలా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కేజీ టమాటా ధర రూ. 160ని దాటితే, మరికొన్ని ప్రాంతాల్లో రూ. 250ని కూడా తాకింది. ప్రభుత్వ డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా కేజీ టమాటా ధర సగటున రూ. 117గా ఉంది.

ప్రజలకు ఉపశమనాన్ని కల్పించేందుకు.. మొబైల్​ వ్యాన్​ల ద్వారా కేంద్రం శనివారం వరకు కేజీ టమాటాలను రూ. 90కి విక్రయించింది. ఆ ధరను రూ. 80కి తగ్గించింది.

కోటీశ్వరుడైన టమాటా రైతు..!

Tomato farmers profits : మహారాష్ట్రలో టమాటాలను పండించే ఓ రైతు.. నెల రోజుల్లో ఏకంగా కోటీశ్వరుడు అయిపోయాడు! పుణె జిల్లాకు చెందిన తుకారామ్​ భగోజి గయాకర్​ అనే వ్యక్తికి 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులోని 12 ఎకరాల్లో టమాటాలను పండిస్తాడు. నెల రోజుల వ్యవధిలో 13వేల టమాటా క్రేట్​(బాక్సు)లను విక్రయించిన తుకారామ్​.. ఏకంగా రూ. 1.5కోట్లను సంపాదించాడని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం