తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bitsat 2024 Registration: బిట్‌శాట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభం

BITSAT 2024 registration: బిట్‌శాట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభం

HT Telugu Desk HT Telugu

15 January 2024, 15:27 IST

  • బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) బిట్‌శాట్ 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించింది.

బిట్‌శాట్ 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
బిట్‌శాట్ 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

బిట్‌శాట్ 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ (బిట్‌శాట్) 2024 కోసం పిలానీలోని బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 11తో ముగియనుంది. ఆసక్తిగల అభ్యర్థులు bitsadmission.com అధికారిక బిట్‌శాట్ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 19 వరకు తమ దరఖాస్తులను సవరించుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

బిట్ శాట్-2024 పరీక్ష సెషన్ 1 కోసం 2024 మే 21 నుంచి మే 26 వరకు, సెషన్ 2 కోసం జూన్ 22 నుంచి జూన్ 26, 2024 వరకు నిర్వహించనున్నారు.

బిట్ శాట్ 2024 దరఖాస్తుకు డైరెక్ట్ లింక్:

బీఫార్మసీ మినహా అన్ని ప్రోగ్రాముల్లో ప్రవేశానికి: అభ్యర్థులు గుర్తింపు పొందిన కేంద్ర లేదా రాష్ట్ర బోర్డు నుంచి 10+2 విధానంలో 12వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో తత్సమాన ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్ లో తగిన ప్రావీణ్యం ఉండాలి.

బీఫార్మసీలో ప్రవేశానికి: గుర్తింపు పొందిన కేంద్ర లేదా రాష్ట్ర బోర్డు నుంచి 10+2 విధానంలో 12వ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో తత్సమాన ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌లో తగిన ప్రావీణ్యం ఉండాలి. అయితే, పీసీఎం ఉన్న అభ్యర్థులు ఫార్మసీ ప్రోగ్రామ్‌కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

బిట్ శాట్ 2024 దరఖాస్తు ఫీజు: బిట్ శాట్ ను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. బిట్ శాట్ -2024 కోసం రెండుసార్లు పరీక్ష రాసే అభ్యర్థికి నిర్ణీత రుసుము రూ. 5400 (పురుష అభ్యర్థికి), రూ. 4400 (మహిళా అభ్యర్థికి) చెల్లించాలి.

సెషన్-1కు ఒకసారి హాజరు కావాలనుకుంటే రూ. 2900 (మహిళా అభ్యర్థులు), రూ. 3400 (పురుష అభ్యర్థులు) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

రెండోసారి (సెషన్ 2లో) హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే పురుష అభ్యర్థులకు రూ. 2000, మహిళా అభ్యర్థులకు రూ.1500 అదనపు ఫీజు చెల్లించాలి. సెషన్ 2కు మాత్రమే హాజరు కావాలనుకుంటే రూ. 2900 (మహిళా అభ్యర్థికి), రూ. 3400 (పురుష అభ్యర్థికి) ఫీజు చెల్లించాలి.

బిట్ శాట్ 2024: ఎలా దరఖాస్తు చేయాలి

  • హోమ్ పేజీలో అధికారిక వెబ్ సైట్ bitsadmission.com సందర్శించాలి.
  • అప్లై లింక్ రిజిస్టర్ పై క్లిక్ చేసి అప్లికేషన్‌ నింపాలి.
  • అప్లికేషన్ ఫారం నింపి అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి. తరువాల అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ప్రింట్ తీసుకోండి.

తదుపరి వ్యాసం