తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bihar Minor Girl Raped : 10ఏళ్ల బాలికపై రేప్​.. గుంతలో పూడ్చేసి..!

Bihar minor girl raped : 10ఏళ్ల బాలికపై రేప్​.. గుంతలో పూడ్చేసి..!

20 December 2022, 12:05 IST

  • Bihar rape case : 10ఏళ్ల బాలిక మృతదేహం ఓ గుంతలో కనిపించింది. ఆమె అత్యాచారానికి గురైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన బీహార్​లో కలకలం సృష్టించింది.

10ఏళ్ల బాలికపై రేప్​.. గుతంలో పూడ్చేసి..!
10ఏళ్ల బాలికపై రేప్​.. గుతంలో పూడ్చేసి..!

10ఏళ్ల బాలికపై రేప్​.. గుతంలో పూడ్చేసి..!

Bihar rape case : బిహార్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్​ డ్రెస్​లో ఉన్న ఓ 10ఏళ్ల బాలిక మృతదేహం ఓ గుంతలో కనిపించింది. ఆమెపై అత్యాచారం జరిగినట్టు తెలుస్తోంది.

ఇదీ జరిగింది..

బిహార్​లోని పోఖర్​భిందా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 15న.. బాధితురాలి తల్లి ఓ పెళ్లి వేడుకకు వెళ్లింది. ఆ సమయంలో బాలిక ఇంట్లోనే ఉంది. జితన్​ యాదవ్​ అనే వ్యక్తి నుంచి బాలిక తల్లికి ఫోన్​ వచ్చింది. పొలంలో ఓ పని కోసం బాలికను పంపించమని అతను చెప్పాడు. ఈ క్రమంలో బాలికి పొలానికి వెళ్లినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి బాలిక కనిపంచకుండా పోయింది.

Minor girl raped in Bihar : ఇంటికి తిరిగివెళ్లిన తల్లి.. బిడ్డ కనిపించకపోయే సరికి కంగారు పడింది. ఎక్కడ వెతికినా ఫలితం దక్కలేదు. "పట్​ఖౌలి పోలీస్​ స్టేషన్​కు వెళ్లాను. అక్కడ నా ఫిర్యాదును రిజిస్టర్​ చేసుకోలేదు. ముగ్గురు వ్యక్తుల పేర్లు చెప్పినా, పట్టించుకోలేదు," అని బాధితురాలి తల్లి ఆరోపించింది.

కాగా.. ఆదివారం బాలిక మృతదేహం గుంతలో కనిపించింది. ఘటనాస్థలంలో స్థానికులు భారీ సంఖ్యలో గుమిగూడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. స్కూల్​ డ్రెస్​లో ఉన్న ఆ బాలిక మృతదేహాన్ని వెలికితీసి.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో బాలిక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులపై బాలిక తల్లి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది.

Bihar crime news : "నా బిడ్డ కనిపించకపోవడంతో నేను పోలీస్​ స్టేషన్​కు వెళ్లాను. అక్కడ నా ఫిర్యాదు తీసుకోలేదు. ముగ్గురు పేర్లు చెప్పినా, లెక్కచేయలేదు. ఇదేంటని ప్రశ్నించిన నా కుమారుడిని దారుణంగా కొట్టారు. వారు నా బిడ్డను రేప్​ చేసి, చంపేశారు. జేసీబీ సాయంతో గుతంలో పూడ్చేశారు. పోలీసులు పట్టించుకోలేదు," అని బాధితురాలి తల్లి ఆరోపించింది.

ఘటన తర్వాత గ్రామంలో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. నిందితులను అరెస్ట్​ చేయాలని డిమాండ్​లు వెల్లువెత్తాయి. పోలీసుల ప్రవర్తనపై నిరసనలు వ్యక్తం చేశారు అక్కడి ప్రజలు.

తదుపరి వ్యాసం