తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  H-1b Visa Changes : హెచ్​-1బీ వీసా వ్యవస్థలో భారీ మార్పులు..! భారతీయులకు పండగే!

H-1B visa changes : హెచ్​-1బీ వీసా వ్యవస్థలో భారీ మార్పులు..! భారతీయులకు పండగే!

Sharath Chitturi HT Telugu

24 October 2023, 10:51 IST

  • H-1B visa changes : ఉద్యోగాల కోసం ఇచ్చే హెచ్​-1బీ వీసా ప్రోగ్రామ్​లో భారీ మార్పులు చేస్తోంది బైడెన్​ ప్రభుత్వం. ఈ మేరకు ప్రతిపాదనలను విడుదల చేసింది. ఆ వివరాలు..

హెచ్​1బీ వీసాల ప్రాసెస్​లో భారీ మార్పులు..!
హెచ్​1బీ వీసాల ప్రాసెస్​లో భారీ మార్పులు..! (HT Photo)

హెచ్​1బీ వీసాల ప్రాసెస్​లో భారీ మార్పులు..!

Changes to H-1B visa : అమెరికా హెచ్​-1బీ వీసా గురించి ఏ వార్త వచ్చినా.. అది చాలా కీలకం. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యంలో ఉద్యోగం చేయాలని భావిస్తున్న భారతీయులు కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో.. హెచ్​-1బీ వీసా ప్రోగ్రామ్​లో పలు కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది జో బైడెన్​ ప్రభుత్వం. పలు ప్రతిపాదనలను తీసుకొచ్చింది. ఇవి అమల్లోకి వస్తే.. వీసా ప్రక్రియలో ఫ్లెక్సిబులిటీ పెరుగుతుందని చెబుతోంది. బైడెన్​ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

మల్టిపుల్​ ఎంట్రీస్​కి ఛాన్స్​ లేదు..!

ఇప్పటివరకు.. ఉద్యోగి తరఫున అనేక హెచ్​-1బీ వీసా ఎంట్రీలను వేసే అవకాశం సంస్థలకు ఉండేది. దీనితో చాలా అప్లికేషన్లు పేరుకుపోతున్నాయి. 2023లో వచ్చిన హెచ్​-1బీ రిజిస్ట్రేషన్స్​లో సగానికిపైగా ఎంట్రీలు రెండోసారి వేస్తున్నవే అని తెలుస్తోంది. ఈ రూల్​కు చెక్​ పెట్టాలని బైడెన్​ ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగి కేవలం ఒక్కసారే రిజిస్టర్​ చేసుకునే విధంగా కొత్త నిబంధనలు తీసుకురావాలని చూస్తోంది. ఇందుకోసం.. ఆయా సంస్థలు.. ఉద్యోగికి సంబంధించిన పాస్​పోర్ట్​ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.

ఎంప్లాయీ- ఎంప్లాయర్​ రిలేషన్​..

H-1B visa latest news : ఉద్యోగి- యజమాని మధ్య రిలేషన్​కు సంబంధించిన ఈ రూల్​ని 2010లో ప్రవేశపెట్టింది అమెరికా. ఇది.. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వారికి అనేక ఆటంకాలు సృష్టిస్తోందని విమర్శలు ఉన్నాయి. కొత్త రూల్​తో.. ఇక వ్యాపారులు హెచ్​-1బీ వీసా పొందొచ్చు. వారి బిజినెస్​ను వృద్ధి చేసుకోవచ్చు.

వర్క్​ ఫ్రం హోం ఓకే..

అమెరికాలో ఉంటూ టెలీవర్క్​, రిమోట్​ వర్క్​, ఆఫ్​ సైట్​ వర్క్​ చేసుకునే వారు కూడా హెచ్​-1బీ వీసాకు అప్లై చేసుకునే విధంగా కొత్త రూల్స్​ని ప్రభుత్వం ప్రతిపాదించింది. కొవిడ్​ అనంతర కాలంలో వేగంగా మారుతున్న ఆఫీస్​ వ్యవస్థకు ఇది మరింత ఊతం అందించనుంది.

మోసం చేస్తే ఇక అంతే..!

ఐటీ కన్సల్టింగ్​ సెక్టార్​ వీసా మోసాలను అరికట్టేందుకు కఠిన నిర్ణయాలను ప్రతిపాదించింది ప్రభుత్వం. ఈ రూల్​ ప్రకారం అధికారులు ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లి రికార్డులు చెక్​ చేసుకోవచ్చు. యజమానులతో మాట్లాడవచ్చు.

స్పెషాలిటీ జాబ్స్​ మరింత కఠినం..!

H-1B visa Indians : స్పెషాలిటీ అక్యుపేషన్​ డెఫినీషన్​ని మార్చుతూ ప్రతిపాదన చేసింది అమెరికా. ఫలితంగా స్పెషాలిటీ జాబ్స్​ మరింత కఠినంగా మారొచ్చు. అప్లై చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన డిగ్రీ కచ్చితంగా ఉండాలి. లేకపోతే వీసా రాకపోవచ్చు.

ప్రస్తుతం ఇవి ప్రతిపాదన దశలో ఉన్నాయి. 2023 డిసెంబర్​ 22 వరకు అభ్యంతరాలు, ఫ్యీడ్​బ్యాక్​ని స్వీకరిస్తుంది అమెరికా. ఆ తర్వాత అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే.. ఈ కొత్త ప్రతిపాదనల్లో చాలా వరకు మంచి విషయాలే ఉన్నాయని వీసా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ కొన్ని అంశాలపై వ్యతిరేక ఎదురవ్వొచ్చని భావిస్తున్నారు.

తదుపరి వ్యాసం