PM Modi US visit live : బైడెన్​ దంపతులతో మోదీ ‘స్టేట్​ డిన్నర్​’-pm modi us visit live blog get latest updates here 23 june 2023 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi Us Visit Live : బైడెన్​ దంపతులతో మోదీ ‘స్టేట్​ డిన్నర్​’

బైడెన్​ దంపతులతో ప్రధాని మోదీ..(AP)

PM Modi US visit live : బైడెన్​ దంపతులతో మోదీ ‘స్టేట్​ డిన్నర్​’

08:10 AM ISTJun 23, 2023 01:40 PM Sharath Chitturi
  • Share on Facebook
08:10 AM IST

  • PM Modi US visit live : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన లైవ్​ అప్డేట్స్​ కోసం ఈ హెచ్​టీ తెలుగు పేజ్​ని ఫాలో అవ్వండి..

Fri, 23 Jun 202308:10 AM IST

స్మృతి ఇరాని వ్యాఖ్యలు..

మోదీ అమెరికా పర్యటనపై బీజేపీ నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రక్షణ, రెనువెబుల్​ ఎనర్జీ వంటి రంగాల్లో పలు కీలక ఒప్పందాలు జరిగాయని, ఇవి దేశాభివృద్ధికి ఉపయోగపడతాయని కేంద్రమంత్రి స్మృతి ఇరాని అభిప్రాయపడ్డారు. 

Fri, 23 Jun 202305:09 AM IST

ఉత్తర కొరియాపై ఫైర్​..

మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఓ ప్రకటన వెలువడనుంది. ఉక్రెయిన్​ భూభాగ సమగ్రతకు భారత్​ అమెరికాలు మద్దతిస్తున్నట్టు ఆ ప్రకటన పేర్కొంది. ఉత్తరకొరియా మిసైల్​ లాంచ్​లను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొంది.

Fri, 23 Jun 202302:44 AM IST

మోదీ ఆటోగ్రాఫ్​ కోసం క్యూ..

స్టేట్​ డిన్నర్​కి ముందు.. అమెరికా కాంగ్రెస్​లో ప్రసంగించారు ప్రధాని మోదీ. ఆ తర్వాత.. కాంగ్రెస్​ సభ్యుల్లో చాలా మంది.. మోదీతో ఫొటోలు దిగాలని, ఆటోగ్రాఫ్​ తీసుకోవాలని క్యూ కట్టడం విశేషం.

Fri, 23 Jun 202301:58 AM IST

అమెరికా క్రికెట్​ టీమ్​..

“అమెరికాలో బేస్​బాల్​తో పాటు క్రికెట్​కి కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్​ కప్​కు క్వాలిఫై అవ్వాలని అమెరికా క్రికెట్​ టీమ్​ ప్రయత్నిస్తోంది. వారికి గుడ్​ లక్​ చెబుతున్నాను,” అని మోదీ అన్నారు.

Fri, 23 Jun 202301:38 AM IST

శ్వేత సౌధంలో.. స్టేట్​ డిన్నర్​

స్టేట్​ డిన్నర్​లో అతిథుల లిస్ట్​ చాలా పెద్దగానే ఉంది. ముకేశ్​ అంబానీ, ఆనంద్​ మహీంద్రా వంటి దిగ్గజ వ్యాపారవేత్తలతో పాటు సుందర్​ పిచాయ్​, సత్య నాదేళ్ల, ఇంద్ర నూయి, టిమ్​ కుక్​ వంటి ప్రముఖ సీఈఓలు స్టేట్​ డిన్నర్​కు హాజరయ్యారు. 

Fri, 23 Jun 202301:16 AM IST

నాటు నాటు..

“రోజులు గడిచే కొద్ది.. భారతీయులు, అమెరికన్లు దగ్గరవుతున్నారు. ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుంటున్నారు. హాలోవీన్​ కోసం భారత్​లోని పిల్లలు స్పైడర్​మ్యాన్​లు అవుతున్నారు. అమెరికన్లు 'నాటు నాటు' పాటకు స్టెప్పులేస్తున్నారు,” అని స్టేట్​ డిన్నర్​లో మోదీ అన్నారు.

Fri, 23 Jun 202312:43 AM IST

దేశంలో వివక్ష లేదు..

అంతకుముందు జరిగిన ఓ మీడియా సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. దేశంలో ముస్లింల హక్కులకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. “ముస్లిం హక్కులపై ఇండియాల వివక్ష ఉందా? మీ ప్రశ్నకు నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ప్రజాస్వామ్యం అన్నది మా రక్తంలో ఉంది.  ప్రజాస్వామ్యం అన్నది మా ఊపిరి. ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నప్పుడు.. వివక్షకు ఆస్కారమే లేదు,” అని మోదీ అన్నారు.

Fri, 23 Jun 202312:38 AM IST

వైట్​ హౌజ్​లో స్టేట్​ డిన్నర్​..

“ప్రధాని మోదీతో నేను, జిల్​ (బైెడెన్​ సతీమణి) చాలా మంచి సమయం గడిపాము. ఈ పర్యటన చాలా ప్రొడక్టివ్​గా సాగింది. ఈరోజున.. భారత్​- అమెరికా మధ్య ఉన్న బలమైన స్నేహ బంధాన్ని మనం వేడుకగా జరుపుకుంటున్నాను,” అని శ్వేతసౌధంలో జరిగిన స్టేట్​ డిన్నర్​లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ అన్నారు.

Fri, 23 Jun 202312:38 AM IST

ఆఫ్రికా కోసం మోదీ ప్రతిపాదన..

అమెరికా పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఈజిప్ట్​కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆఫ్రికాను జీ20 శాశ్వత సభ్య దేశంగా గుర్తించాలని ఆయన ప్రతిపాదించారు. మోదీ ప్రతిపాదనను పరిశీలిస్తామని బైెడెన్​ అన్నారు.

Fri, 23 Jun 202312:35 AM IST

బైడెన్​ దంపతులతో మోదీ డిన్నర్​..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన మూడో రోజుకు చేరింది. తాజాగా.. బైడెన్​ దంపతులతో కలిసి ఆయన స్టేట్​ డిన్నర్​కు హాజరయ్యారు. వందలాది మంది అతిథులు సైతం ఈ ఈవెంట్​లో పాల్గొన్నారు.