తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bharti Airtel Q1 Results : ఎయిర్​టెల్​ నికర లాభం.. 466శాతం జంప్​​!

Bharti Airtel Q1 results : ఎయిర్​టెల్​ నికర లాభం.. 466శాతం జంప్​​!

Sharath Chitturi HT Telugu

08 August 2022, 17:01 IST

    • Bharti Airtel Q1 results : ఎయిర్​టెల్​ క్యూ1 ఫలితాలు మెరుగ్గా నమోదయ్యాయి! నికర లాభం 466శాతం వృద్ధి చెందింది.
క్యూ1 ఫలితాలను విడుదల చేసిన భారతీ ఎయిర్​టెల్​
క్యూ1 ఫలితాలను విడుదల చేసిన భారతీ ఎయిర్​టెల్​ (Bloomberg)

క్యూ1 ఫలితాలను విడుదల చేసిన భారతీ ఎయిర్​టెల్​

Bharti Airtel Q1 results : 2022-23 మొదటి త్రైమాసిక ఫలితాలను సోమవారం ప్రకటించింది భారతీ ఎయిర్​టెల్​. కన్సాలిడేటెడ్​ నెట్​ ప్రాఫిట్(నికర లాభం)​ 465.81శాతం పెరిగి రూ. 1,606.9కు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నెట్​ ప్రాఫిట్​ విలువ రూ.283.50కోట్లుగా ఉండేది.

ట్రెండింగ్ వార్తలు

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

ఎయిర్​టెల్​ ఆపరేషన్ల ద్వారా వచ్చిన కన్సాలిడేటెడ్​ రెవెన్యూ రూ. 32,805కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం రూ. 26,854కోట్లుగా నమోదైంది.

ఏప్రిల్​- జూన్​ క్యూ1 త్రైమాసికంలో మొబైల్​ సర్వీసెస్​ నుంచి ఎయిర్​టెల్​కు వచ్చిన ఆదాయం 27శాతం వృద్ధి చెంది.. రూ. 18,220కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 14,306గా ఉండేది.

ఇక టెలికాం సంస్థల్లో అత్యంత కీలకంగా చూసే ఆర్​పూ(యావరేజ్​ రెవెన్యూ పర్​ యూజర్​).. కూడా ఎయిర్​టెల్​కు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఆర్​పూ రూ. 146గా ఉండగా.. ఈసారి అది రూ. 183కి చేరింది.

కన్సాలిడేటెడ్​ ఎబిట్​డా రూ. 16,604కోట్లుగా నమోదైంది. ఎబిట్​డా మార్జిన్​ 50.6శాతంగా ఉంది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి ఎయిర్​టెల్​ షేరు ధర రూ. 704.95కి చేరింది.

5జీ కోసం..

మరోవైపు.. 5జీని ప్రజలకు అందించేందుకు ఎయిర్​టెల్​ కృషిచేస్తోంది. వచ్చే నెలలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు సన్నద్ధమవుతోంది.

తదుపరి వ్యాసం