తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Australian Senator Oath : భగవద్గీత సాక్షిగా ప్రమాణం..! ఆస్ట్రేలియా పార్లమెంట్ లో సరికొత్త చరిత్ర

Australian Senator Oath : భగవద్గీత సాక్షిగా ప్రమాణం..! ఆస్ట్రేలియా పార్లమెంట్ లో సరికొత్త చరిత్ర

07 February 2024, 15:01 IST

  • Australian Senator Oath: భారత సంతతికి చెందిన వరుణ్ ఘోష్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియా పార్లమెంటులో భగవద్గీత సాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా వరుణ్ ఘోష్ కు పలువురు ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

Varun Ghosh took an oath on Bhagavad Gita as he became a senator.
Varun Ghosh took an oath on Bhagavad Gita as he became a senator. (X/@PennyWong)

Varun Ghosh took an oath on Bhagavad Gita as he became a senator.

Australian Senator Varun Ghosh Oath: భగవద్గీతపై ప్రమాణం చేసిన భారత సంతతికి చెందిన తొలి ఆస్ట్రేలియా పార్లమెంట్ సభ్యుడిగా బారిస్టర్ వరుణ్ ఘోష్ చరిత్ర సృష్టించారు. మంగళవారం ఆయన ప్రమాణస్వీకారం జరిగింది. పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన వరుణ్ ఘోష్ ను చట్టసభలకు నామినేట్ అయ్యారు.

వరుణ్ ఘోష్ వృత్తిరీత్యా న్యాయవాది. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రెన్ ఆస్ట్రేలియాలో ఆయన ఆర్ట్స్, లా డిగ్రీలో పట్టభద్రుడయ్యారు. 17 ఏళ్ల వయసులో ఉండగానే… భారత్ నుంచి వెళ్లి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. వాషింగ్టన్ లో ఉన్న వరల్డ్ బ్యాంక్‌కు కన్సల్టెంట్‌గా కూడా సేవలందించారు.

ఆస్ట్రేలియన్ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్... వరుణ్ ఘోష్ కు అభినందనలు తెలిపారు. “పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి మా సరికొత్త సెనేటర్ వరుణ్ ఘోష్‌కు స్వాగతం. సెనేటర్ ఘోష్ భగవద్గీతపై ప్రమాణం చేసిన మొట్టమొదటి ఆస్ట్రేలియా సెనేటర్. నేను చాలాసార్లు చెబుతుంటాను, మీరు ఏదైనా విషయంలో మొదటి వ్యక్తి అయినప్పుడు, మీరు చివరివారు కాదని నిర్ధారించుకోవాలి" అంటూ ట్విట్టర్ (X)లో రాసుకొచ్చారు. "సెనేటర్ ఘోష్ తన కమ్యూనిటీకి మరియు వెస్ట్ ఆస్ట్రేలియన్లకు బలమైన గొంతుకగా ఉంటారని నాకు తెలుసు" అంటూ కూడా తన పోస్టులో ప్రస్తావించారు.

ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ కూడా ట్వీట్ చేస్తూ…. “పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి ఎంపికైన మా సరికొత్త సెనేటర్ వరుణ్ ఘోష్‌కి స్వాగతం. మీరు జట్టులో ఉండటం చాలా అద్భుతంగా ఉంది” అంటూ ట్వీట్ చేశారు.

వరణ్ ఘోష్ ఆస్ట్రేలియాలోని పెర్త్ లో స్థిరపడ్డారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ మరియు లా లో తన డిగ్రీని పొందారు. న్యూయార్క్‌లోని ఫైనాన్స్ అటార్నీగా బాధ్యతలు నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని లేబర్ పార్టీలో చేరడంతో అతని రాజకీయ జీవితం పెర్త్‌లో ప్రారంభమైందని ఎఎన్ఐ(ANI) నివేదించింది.

తదుపరి వ్యాసం