AUS vs WI Test Series: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ - విండీస్ త‌ర‌ఫున ఎనిమిది మంది క్రికెట‌ర్లు అరంగేట్రం-eight cricketers to make test debut for west indies with australia series ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Aus Vs Wi Test Series: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ - విండీస్ త‌ర‌ఫున ఎనిమిది మంది క్రికెట‌ర్లు అరంగేట్రం

AUS vs WI Test Series: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ - విండీస్ త‌ర‌ఫున ఎనిమిది మంది క్రికెట‌ర్లు అరంగేట్రం

Nelki Naresh Kumar HT Telugu
Dec 22, 2023 01:10 PM IST

AUS vs WI Test Series: ఆస్ట్రేలియాతో జ‌న‌వ‌రిలో జ‌రుగ‌నున్న టెస్ట్ సిరీస్ ద్వారా విండీస్ త‌ర‌ఫున ఎనిమిది మంది ఆట‌గాళ్లు టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఈ టెస్ట్ సిరీస్ కోసం ఏడుగురు అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్ల‌కు జ‌ట్టులో విండీస్ బోర్డు చోటిచ్చింది.

వెస్టిండీస్ క్రికెట్ టీమ్
వెస్టిండీస్ క్రికెట్ టీమ్

AUS vs WI Test Series: వ‌ర‌ల్డ్ క‌ప్ విన్నర్ ఆస్ట్రేలియాతో జ‌రుగ‌నున్న టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్‌ మేనేజ్‌మెంట్ ఏడుగురు అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్ల‌ను ఎంపిక‌చేసింది. సీనియ‌ర్ల‌ను త‌ప్పించిన సెలెక్ట‌ర్లు కొత్త ప్లేయ‌ర్ల‌తో టీమ్‌ను నింపేశారు. కీమ‌ర్ రోచ్‌, క్రెయిగ్ బ్రాత్‌వైట్ మాత్ర‌మే జ‌ట్టులో సీనియ‌ర్లు. ఈ టెస్ట్ సిరీస్‌తో అకీమ్ జోర్డాన్‌, జ‌స్టిన్ గ్రేవ్స్‌, హోడ్జ్‌, మెకంజీ, ఇమాల్క్‌, సింక్లెయిర్‌, షామ‌ర్ జోసెఫ్‌, మెకిస్క్ విండీస్ త‌ర‌ఫును టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు.

ఒకే టెస్ట్ సిరీస్‌తో ఎనిమిది ఆట‌గాళ్లు ఎంట్రీ ఇవ్వ‌డం ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది. వీరిలో చాలా మంది క్రికెట‌ర్లు ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్ కూడా ఆడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. టీ20, వ‌న్డేల్లో చెల‌రేగుతోన్న విండీస్ ఆట‌గాళ్లు టెస్టుల్లో మాత్రం పెద్ద‌గా రాణించ‌లేక‌పోతున్నారు.

సుదీర్ఘ ఫార్మెట్‌లో విండీస్ జ‌ట్టును బ‌లోపేతం చేయాల‌నే ఆలోచ‌న‌తో కొత్త ఆట‌గాళ్ల‌కు ఛాన్స్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. జ‌న‌వ‌రి 17 నుంచి ఫ‌స్ట్ టెస్ట్‌, జ‌న‌వ‌రి 25 నుంచి సెకండ్ టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్‌కు విండీజ్‌జ‌ట్టుకు బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.