తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Tb Day 2023 । మాహమ్మారి వ్యాధులు ప్రబలుతున్న వేళ టీబీతో జాగ్రత్త!

World TB Day 2023 । మాహమ్మారి వ్యాధులు ప్రబలుతున్న వేళ టీబీతో జాగ్రత్త!

HT Telugu Desk HT Telugu

24 March 2023, 9:04 IST

  • World TB Day 2023: క్షయ అనేది గాలి ద్వారా వ్యాపించే ఒక అంటువ్యాధి. కోవిడ్, H3N2 కేసుల నడుమ ఈ టీబీ రోగం కూడా ఇబ్బంది కలిగించే సమస్య. దీని లక్షణాలు, చికిత్స తెలుసుకోండి.

World TB Day 2023- Tuberculosis Treatment
World TB Day 2023- Tuberculosis Treatment (Unsplash)

World TB Day 2023- Tuberculosis Treatment

World TB Day 2023: ఒకవైపు కోవిడ్19 కేసులు, మరోవైపు H3N2 ఇన్ల్ఫుఎంజా కేసులు ఉండగానే టీబీ కేసులు కూడా మన దేశంలో ఇంకా ఉన్నాయి. 2025 నాటికి టీబీని పూర్తిగా అంతం చేయాలని ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. క్షయ (Tuberculosis - TB) అనేది సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ఒక వ్యాధి. ఇది కూడా COVID-19 లాగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అంటువ్యాధి. వ్యాధి సోకిన వ్యక్తి ద్వారా గాలిలో విడుదలయ్యే తుంపర్ల ద్వారా ఇది ఎక్కువగా సంక్రమిస్తుంది. రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా కేవలం మాట్లాడినప్పుడు కూడా వారికి సమీపంలో ఉండే వేరే వ్యక్తికి సోకే ప్రమాదముంది. ఇది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. ఈ బ్యాక్టీరియా సాధారణంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది, అక్కడితోనే ఆగకుండా ఈ బ్యాక్టీరియా శరీరంలోని మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు వంటి ఇతర భాగాలపైనా దాడి చేస్తుంది. చికిత్స తీసుకోకపోతే ఇది వ్యక్తి మరణానికి కూడా దారితీయవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Monday Motivation: ఎవరి గొప్ప వారిదే, జీవితంలో ఎదురయ్యే ఎవరినీ చులకనగా చూడకండి

Acid Reflux At Night : రాత్రి గుండెల్లో మంట రావడానికి కారణాలు.. ఈ అసౌకర్యాన్ని ఎలా తొలగించాలి?

Relationship Tips : పెళ్లికి ముందే ఈ 5 విషయాలు చర్చించండి.. లేదంటే తర్వాత సమస్యలు

Cashew Tomato Gravy : టొమాటో జీడిపప్పు గ్రేవీ తయారు చేయండి.. ఎంజాయ్ చేస్తూ తింటారు

అయితే, TB బాక్టీరియా సోకిన ప్రతి ఒక్కరూ జబ్బుపడరు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు టీబీ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

క్షయ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి, సకాలంలో చికిత్సను పొందడానికి ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం (World Tuberculosis Day) గా నిర్వహిస్తున్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం 2023 థీమ్- "అవును, మనం క్షయ వ్యాధిని అంతమొందించవచ్చు."

TB Symptoms -క్షయవ్యాధి లక్షణాలు

రెండు వారాలకు పైగా తీవ్ర దగ్గు

ఛాతీలో నొప్పి

కఫంతో కూడిన దగ్గు, శ్లేష్మంలో రక్తం

అలసట లేదా బలహీనత.

ఆకలి లేకపోవడం

బరువు తగ్గడం

చలి

జ్వరం

TB Treatment -క్షయవ్యాధికి చికిత్స

క్షయ వ్యాధికి చికిత్స అందుబాటులో ఉంది. TBని యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేసి, నయం చేయవచ్చు. ఎక్కువ కాలం మందులు వాడాల్సి ఉంటుంది. క్షయవ్యాధి (TB) చికిత్సలో సాధారణంగా 6 నెలలు యాంటీబయాటిక్స్ తీసుకోవడం ఉంటుంది. చికిత్స సమయంలో చాలా మందికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే మందులు వాడుతూ ఉండవచ్చు.

ఔషధాలతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే సరైన పోషకాహారం తీసుకోవడం వలన మరింత వేగంగా ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం