తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Job Offer : వారానికి 40 గంటల పని.. రూ.1.5 కోట్ల జీతం.. ఈ ఉద్యోగం ఎక్కడంటే?

Job Offer : వారానికి 40 గంటల పని.. రూ.1.5 కోట్ల జీతం.. ఈ ఉద్యోగం ఎక్కడంటే?

Anand Sai HT Telugu

09 April 2024, 12:30 IST

    • Job Offer : ఉద్యోగం చేసే వారికి జీతం ఇచ్చే తృప్తి మాటల్లో చెప్పలేనిది. అయితే ఎక్కువ శాలరీకి పని చేయాలని అందరూ అనుకుంటారు. కానీ అవకాశాలు దొరకవు. అయితే ఓ ప్రాంతంలో కోటిపైనే జీతం ఇస్తారట. వారానికి 40 గంటలు పని.
జాబ్ ఆఫర్
జాబ్ ఆఫర్ (Unsplash)

జాబ్ ఆఫర్

మీరు ఇంజనీర్ లేదా డాక్టర్ కావచ్చు అత్యధిక జీతం ఇచ్చే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ప్రపంచంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఉద్యోగంలో ఎక్కువ జీతం కోసమే ప్రయత్నాలు చేస్తారు. అలాగే డాక్టర్లకు అన్ని దేశాల్లోనూ సమాన డిమాండ్ ఉంది. కొన్ని దేశాల్లో డాక్టర్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు.

మీకు ఎక్కువ జీతం కావాలి అంటే మీరు అమెరికా, ఇంగ్లాండ్ లేదా కెనడా, దుబాయ్ మొదలైన చెందిన దేశాలకు వెళ్లాలి. తక్కువ మానవ వనరులు ఉన్నందున చాలా జీతం ఇస్తారు. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్‌లో అత్యధిక జీతం పొందవచ్చు.

కానీ ఇక్కడ ఒక ద్వీప దేశం వైద్యులకు ఇతర దేశాలకు చెల్లించనంత చెల్లించడానికి ముందుకొచ్చింది. ఏడాదికి రూ.1.5 కోట్ల వేతనం ఉంటుందని ప్రకటించింది. వైద్యుడికి ఏడాదికి 1.5 కోట్ల జీతం నిర్ణయించిన స్కాటిష్ దీవిలో డాక్టర్ పోస్టుకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.

ఇంగ్లండ్‌లో వైద్యుడి జీతం కంటే ఇది దాదాపు 40 శాతం ఎక్కువ అని తెలుస్తోంది. స్కాట్లాండ్ ద్వీపం చాలా తక్కువ జనాభా ఉన్నప్పటికీ, ఇక్కడ వైద్యులు లేరు. వేసవిలో ఈ ద్వీపం అందాలను ఆస్వాదించేందుకు లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అయినా కూడా అక్కడి ప్రభుత్వం నియమించిన ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరు.

ఆస్పత్రికి వెళ్లే రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ఈ ద్వీప ప్రాంతంలో అనారోగ్యంతో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుల కొరత కూడా దీనికి కారణం. అందుకోసం ఖరీదైన జీతంతో వైద్యులను నియమించుకోవడం ప్రారంభించారు. జీతంతో పాటు రూ.8 వేలు, రూ.13 వేలు బదిలీ అలవెన్స్ ఉంది. గ్రాట్యుటీ రూ.11 లక్షల ప్రభుత్వం అదనపు భత్యం కూడా అందిస్తుంది. అంటే ఒక వైద్యుడికి ఏడాదికి రూ.1.5 కోట్లపైనే వస్తుంది.

ఈ శాశ్వత ఉద్యోగానికి వారానికి 40 గంటల పని చేయాలి. ప్రపంచంలోని ఏ మూలకు చెందిన వారైనా అక్కడ సేవ చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ చేరిన తర్వాత అక్కడ స్థిరపడటానికి సిద్ధంగా ఉండాలి. వారికి ప్రభుత్వం నుంచి అందే అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది.

స్కాట్లాండ్‌లో తక్కువ సంఖ్యలో చిన్న ద్వీపాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత ఉందని ఎన్‌హెచ్‌ఎస్‌ తెలిపింది. ఐదు దీవుల్లో వైద్యులు సేవలందించాల్సి ఉంటుంది. ఈ దీవులన్నింటి మధ్య ప్రయాణించడానికి వారికి ప్రయాణ భత్యం కూడా లభిస్తుంది. సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్న వైద్యులకు ఎన్‌హెచ్‌ఎస్ స్వాగతం పలుకుతోంది.

ఈ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించిన అనుభవం ఉంటే బాగుంటుందని ఎన్‌హెచ్‌ఎస్‌ తెలిపింది. కోస్టల్ హెల్త్ కేర్ ఫెసిలిటీలో పనిచేసిన అనుభవం వారికి ఇక్కడ సులభంగా అలవాటు పడటానికి ఉపయోగపడుతుంది. వారానికి 40 గంటలు పనిచేస్తే కచ్చితంగా దీవి అందాలను ఆస్వాదించేందుకు వెళ్లవచ్చని సంస్థ తెలిపింది.

తదుపరి వ్యాసం